Jawan Trailer Review: షేక్ చేస్తున్న షారుఖ్ ఖాన్ ‘జవాన్’ ట్రైలర్
షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన 'జవాన్' సినిమా ట్రైలర్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 31-08-2023 - 3:57 IST
Published By : Hashtagu Telugu Desk
Jawan Trailer Review: షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన ‘జవాన్’ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ జవాన్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. బాద్షా షారుక్ ఖాన్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘జవాన్’ ట్రైలర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-డ్రామా థ్రిల్లర్‌లో కింగ్ షారుక్ ఖాన్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించారు. ట్రైలర్‌లో షారుక్ డిఫరెంట్ షేడ్స్ ప్రేక్షకుల్ని తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి. ‘జవాన్’ ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో ‘టైగర్ కా బాప్’ అనే పదం ట్రెండ్ అవుతోంది. మరీ ముఖ్యంగా ట్రైలర్ ట్విట్టర్‌లో సంచలనం సృష్టించింది. పఠాన్ తర్వాత ‘జవాన్’ ట్రైలర్ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేసింది. దీపికా, షారుఖ్ ఖాన్‌ల మధ్య యాక్షన్, నయనతార, కింగ్‌ఖాన్‌ల మధ్య రొమాన్స్‌ని ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
BAAP SE BATH KAR 🔥🔥🔥 MY FAV FROM #JawanTrailer #ShahRukhKhan #Jawan #DeepikaPadukone #Nayanthara #VijaySethupathi pic.twitter.com/azOcpKqw6H
— king film (@pathaan2film) August 31, 2023
యాక్షన్-డ్రామా-రొమాన్స్, థ్రిల్లర్‌ల మధ్య ఈ ట్రైలర్‌లో కింగ్‌ఖాన్ డైలాగ్‌స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. కొడుకును తాకడానికి ముందు తండ్రితో మాట్లాడటం డైలాగ్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇది జవాన్ ట్రైలర్‌లోనే హైలెట్ గా నిలిచింది. జవాన్ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో 1 గంటలో 2 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది.
Also Read: Sonia-Sharmila: సోనియాతో షర్మిల భేటీ.. కాంగ్రెస్ లో YSRTP విలీనం!