Jani Master Wife : జానీ మాస్టర్ భార్య అరెస్ట్ కు రంగం సిద్ధం..?
Jani Master : బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు యత్నించారన్న ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది
- Author : Sudheer
Date : 21-09-2024 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
అత్యాచార ఆరోపణలతో అరెస్టై చంచల్ గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కేసు (Jani Master Case)లో మరో ట్విస్ట్ చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఆయన భార్య ఆయేషా (Jani Wife Ayosha)ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు యత్నించారన్న ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ యువతిని ఆయేషా బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటె జానీ మాస్టర్ వైఫ్ ఆయెషా మాత్రం తన భర్తను కావాలనే ఈ కేసులో ఇరికించారని వాపోయింది. అంతే కాదు సదరు బాధితురాలి ఫై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆ అమ్మాయిది హనీ ట్రాప్. ఆమెకు లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం. అందుకే ఇలా చేసింది. ఆమెను పాములా వాడుకుంటున్నారు. ఈ రోజు ఎవరైతే ఆ అమ్మాయికి సపోర్టు చేసి.. ఇవన్నీ చేయిస్తున్నారో..వాళ్ల కుటుంబం కూడా ఈ పొజిషన్ లో కూర్చుంటారు.
నన్ను కొట్టారు అని వాళ్ల మీదే ఆ అమ్మాయి కేసు పెడుతుంది. చివరకు ఆమెను రోడ్డు మీద వదిలేస్తారు. సినీ ఇండస్ట్రీలో సొంత తమ్ముడు, సొంత సిస్టర్ ఎదుగుతున్నా చూడలేరు. సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతుంటే తట్టుకోలేక ఇదంతా చేస్తున్నారు. ఆయనకు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేదు. ఆయన టాప్‌లో వెళుతున్నాడని తట్టుకోలేక ఈ కుట్ర చేశారు. జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్ ఇండస్ట్రీలోనే లేడు. ఢీ షోలో జానీ అప్పుడప్పుడు వెళ్లినా చాలా క్రేజ్ ఉండేది. ఆయనంటే చాలా మందికి జలస్. జానీ మాస్టర్ స్టైల్‌గా ఉన్నా జలస్సే. ఆయన వే ఆఫ్ లివింగ్, పద్దతి కూడా ఇతరులు కుళ్లుకునే విధంగా ఉంటుంది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇలా ఎదిగిపోయాడు అనుకుంటున్నారు. అందుకే ఈ కుట్ర చేశారు’ అంటూ చెప్పుకొచ్చింది.
Read Also : Rahul Gandhi : సిక్కు వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ