Jai Hanuman : మైత్రి చేతికి జై జనుమాన్..!
హనుమాన్ సినిమాను ప్రైం షో ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఐతే ఈ సినిమా సీక్వెల్ అదే జై హనుమాన్ ని కూడా అతనే నిర్మిస్తారని
- By Ramesh Published Date - 10:52 PM, Wed - 4 September 24
సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని అందుకున్న హనుమాన్ సినిమా సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన హనుమాన్ సినిమాలో తేజా సజ్జా లీడ్ రోల్ లో నటించాడు. ఐతే ఈ సినిమా సీక్వెల్ (Sequel) లో స్టార్స్ మారుతారని ప్రచారం జరుగుతుంది. హనుమాన్ సినిమాను ప్రైం షో ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఐతే ఈ సినిమా సీక్వెల్ అదే జై హనుమాన్ ని కూడా అతనే నిర్మిస్తారని అనుకున్నారు కానీ జై హనుమాన్ సినిమా నిర్మాత మారినట్టు తెలుస్తుంది.
నిరంజన్ రెడ్డి నుంచి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ కొనేశారని తెలుస్తుంది. వరుస పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతున్న మైత్రి మూవీ మేకర్స్ జై హనుమాన్ సినిమాను కూడా టేకప్ చేస్తున్నారని టాక్. ఆల్రెడీ హనుమాన్ సూపర్ హిట్ అయ్యింది కాబట్టి జై హనుమాన్ (Jai Hanuman,) కు భారీ క్రేజ్ ఉంటుంది.
అంచనాలకు తగినట్టుగా సినిమా తెరకెక్కిస్తే మాత్రం మరో బ్లాక్ బస్టర్ కొట్టినట్టే. ఐతే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలియగానే ఈ ప్రాజెక్ట్ లో బడా స్టార్స్ నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) డైరెక్షన్ లోనే నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుండగా జై హనుమన్ లో కూడా మోక్షజ్ఞ ఉంటే ఎలా ఉంటుందా అన్న చర్చ నందమూరి ఫ్యాన్స్ లో మొదలైంది. ఏది ఏమైనా జై హనుమాన్ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ఈ న్యూస్ సినిమాపై మరింత హైప్ పెంచేస్తున్నాయి.
Related News
Simba is Coming : సింబా వచ్చేస్తున్నాడు.. మోక్షజ్ఞ మూవీ అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ..!
Simba is Coming Prashanth Varma Mokshagna Movie Annoucement సింబాలిక్ గా బాలయ్య మొఫాసా సింహం అయితే అతని కొడుకు మోక్షజ్ఞ సింబాగా చెబుతున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో హనుమాన్ మొదటిది కాగా మోక్షజ్ఞ