Jagapathi Babu : సైలెంట్ గా చరణ్ RC16 షూటింగ్.. కొత్త లుక్ కోసం కష్టపడుతున్న జగపతి బాబు..
బుచ్చిబాబు చాలా ఫాస్ట్ గా RC16 పూర్తిచేసే పనిలో ఉన్నాడు.
- By News Desk Published Date - 10:47 AM, Thu - 16 January 25

Jagapathi Babu : రామ్ చరణ్ ఇటీవల గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ప్రస్తుతం ఆ సినిమా థియేటర్స్ లో నడుస్తుంది. దీని తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ మైసూర్ లో అయిపోయింది. మూడు సాంగ్స్ కూడా ఆడియో కంపోజింగ్ అయిపొయింది. బుచ్చిబాబు చాలా ఫాస్ట్ గా RC16 పూర్తిచేసే పనిలో ఉన్నాడు.
ప్రస్తుతం కూడా చరణ్ లేని సీన్స్ షూట్ చేస్తున్నట్టు సమాచారం. తాజాగా నటుడు జగపతి బాబు ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ వీడియో షేర్ చేసి.. చాలా కాలం తర్వాత బుచ్చిబాబు సాన RC16 సినిమా కోసం మంచి పని పెట్టాడు. గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది అని తెలిపాడు. దీంతో RC16 సినిమాలో జగపతి బాబు ఓ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడని, దాని మేకోవర్ కోసం బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోలో జగపతి బాబు లుక్ కోసం మేకప్ టీమ్ కష్టపడుతున్నారు. దాంతో పాటు వీడియోలోనే లుక్ కూడా రివీల్ చేసేసారు జగపతి బాబు.
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : Jr NTR : దేవర విలన్ పై కత్తితో దాడి.. స్పందించిన ఎన్టీఆర్..