Jacqueline Fernandez: ఢిల్లీ కోర్టుకు హాజరైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ రోజు ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. ఆమె రూ. 200 కోట్ల మనీలాండరింగ్ జరిపినట్టు ఆరోపణల నేపథ్యంలో ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు
- By Praveen Aluthuru Published Date - 09:45 PM, Wed - 5 July 23
Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ రోజు ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. ఆమె రూ. 200 కోట్ల మనీలాండరింగ్ జరిపినట్టు ఆరోపణల నేపథ్యంలో ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఆగస్టు 31, 2022న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ నేపథ్యంలో ఫెర్నాండెజ్‌ను కోర్టుకు హాజరుకావలసిందిగా కోరింది. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె కోర్టుకు హాజరయ్యారు. ఈ రోజు విచారణలో భాగంగా ప్రత్యేక న్యాయమూర్తి శైలేంద్ర మాలిక్ వాదనలు విన్నారు. ఇదిలా ఉండగా 50,000 వ్యక్తిగత పూచీకత్తుపై గత ఏడాది నవంబర్ 15న కోర్టు ఫెర్నాండెజ్‌కు బెయిల్ మంజూరు చేసింది.
Read More: Drinking Water Types: ఏంటి?నీటిలో కూడా అన్ని రకాలు ఉన్నాయా.. అవేంటో తెలుసా?