Prabhas : రాజా సాబ్ నుంచి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రెడీ..!
కల్కి తర్వాత ప్రభాస్ రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
- By Ramesh Published Date - 12:07 PM, Sun - 28 July 24

Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా కల్కి 2898 AD (Kalki 2898 AD) సినిమా తో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. భైరవ పాత్రలో తన కామెడీతో పాటు యాక్షన్ సీన్స్ తో కూడా అదరగొట్టాడు ప్రభాస్. ఇక కల్కి తర్వాత ప్రభాస్ రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమాలో మాలవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా గ్లింప్స్ రిలీజ్ పోస్టర్ వదిలారు. రాజా సాబ్ నుంచి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రిలీజ్ కు రెడీ అవుతుంది. మామూలుగా ఇప్పుడు అందరు పాన్ ఇండియా అంటున్నారు కాబట్టి వెరైటీగా ప్రభాస్ కి నేషనల్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి రాజా సాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ (Rajasaab Fan India Glimpse) వదులుతున్నారు. దీనికి సంబందించిన ఒక కలర్ ఫుల్ పొస్టర్ ప్రభాస్ ప్రొఫైల్ లుక్ తో కనిపిస్తున్నాడు.
రాజా సాబ్ సినిమా టీజర్ ని సోమవార సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ రాజా సాబ్ సినిమా థ్రిల్లర్ అంశాలతో వస్తుంది. మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ ని మెప్పించేలా చేస్తుందని అంటున్నారు. రాజా సాబ్ సినిమా గ్లింప్స్ తోనే అంచనాలు పెంచాలని చూస్తున్నారు మేకర్స్.
రాజా సాబ్ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై చిత్ర యూనిట్ సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. రాజా సాబ్ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. ఐతే ఈ సినిమాపై ఫ్యాన్స్ అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
Also Read : IND vs SL 2nd T20: నేడు భారత్- శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20.. పాండ్యాను తప్పిస్తారా..?