Shruthi Hassan : అడివి శేష్ డెకాయిట్ నుంచి హీరోయిన్ జంప్..?
Shruthi Hassan ఫస్ట్ లుక్ గ్లింప్స్ తోనే ఆకట్టుకున్న డెకాయిట్ సినిమా నుంచి నిజంగానే శృతి ఎగ్జిట్ అయ్యిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ ప్రభాస్ సలార్ లో కనిపించిన శృతి హాసన్
- By Ramesh Published Date - 02:23 PM, Tue - 8 October 24

యువ హీరోల్లో కంటెంట్ ఉన్న కథలు.. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిందించేందుకు కృషి చేస్తుంటాడు అడివి శేష్. అతను చేసే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే నమ్మాల్సిందే. తెలుగు సినిమాను తన రేంజ్ లో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాలని చూసే హీరో అడివి శేష్(Adivi Sesh).
లాస్ట్ ఇయర్ మేజర్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన అడివి శేష్ ఈ ఇయర్ ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. ఐతే నెక్స్ట్ సినిమా మాత్రం 3 సినిమాలతో వస్తానని అంటున్నాడు.
డెకాయిట్ సినిమా నుంచి..
అడివి శేష్ ప్రస్తుతం గూఢచారి 2, డెకాయిట్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ పక్కా అని తెలుస్తుంది. డెకాయిట్ సినిమా నుంచి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అడివి శెష్ డెకాయిట్ నుంచి హీరోయిన్ శృతి హాసన్ (Shruthi Hassan) బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంది. డెకాయిట్ (Decoit) లవ్ స్టోరీ అంటూ ఇద్దరు దొంగల ప్రేమ కథగా ఫస్ట్ గ్లింప్స్ ఇంప్రెస్ చేసింది.
ఈ సినిమాను సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా షానీల్ డియో డైరెక్ట్ చేస్తున్నారు. ఇదివరకు అతను సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఫస్ట్ లుక్ గ్లింప్స్ తోనే ఆకట్టుకున్న డెకాయిట్ సినిమా నుంచి నిజంగానే శృతి ఎగ్జిట్ అయ్యిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ ప్రభాస్ సలార్ లో కనిపించిన శృతి హాసన్ తెలుగు తమిళ భాషల్లో ఛాన్సులు అందుకుంటుంది. మరి డెకాయిట్ లో శృతి ఉందా లేదా అన్న దాని మీద త్వరలో క్లారిటీ వస్తుంది.
Also Read : CBN Delhi Tour: ఏపీ ప్రజలకు శుభవార్త.. విశాఖ రైల్వే జోన్ కు ముహూర్తం ఫిక్స్..