Pawan Kalyan Divorce Rumours: మూడో భార్యకు ‘పవన్ కళ్యాణ్’ విడాకులు ఇవ్వబోతున్నారా?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడోసారి విడాకుల బాట పట్టనున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
- Author : Balu J
Date : 12-01-2023 - 3:08 IST
Published By : Hashtagu Telugu Desk
చిత్రపరిశ్రమలో (Cinema) పెళ్లిళ్లు.. విడాకులు సర్వసాధారణంగా మారుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు తమ వైవాహిక జీవితాలకు గుడ్ బై చెప్పారు. అందులో కొందరు రెండో పెళ్లి చేసుకోగా, మరికొందరు విడాకులు (Divorce) తీసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా సెలబ్రిటీలు తమ వైవాహిక జీవితాలను గుడ్ బై చెబుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడోసారి విడాకుల బాట పట్టనున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ అతని 3వ భార్య అన్నా లెజ్నెవా కు బ్రేకప్ చెప్పనున్నట్టు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెన్స్ లో రూమర్స్ వినిపించాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో ఈ జంట కేసు వేశారని కూడా రిపోర్ట్ చేశాయి. దీని గురించి ఇంకా అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ఈ పుకార్లలో నిజం లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan), అన్నా లెజ్నెవా 2013లో వివాహం చేసుకున్నారు. వారికి పోలెనా అంజనా పవనోవ్నా అనే కుమార్తె, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నారు. గతంలో నందిని, రేణు దేశాయ్‌లను పెళ్లి చేసుకున్న కళ్యాణ్ (Pawan Kalyan) కి ఇది మూడో పెళ్లి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రేక్షకులకు ముందుకు రానుంది.
Also Read: Veera Simha Reddy OTT: ఓటీటీలోకి వీరసింహారెడ్డి.. రిలీజ్ డేట్ ఫిక్స్!