Indra Re-Release : ‘ఇంద్ర’ మేకింగ్ వీడియోలో రామ్ చరణ్ ఎలా ఉన్నాడో చూడండి
నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 'అమ్మడు అప్పచీ' సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు
- By Sudheer Published Date - 08:14 PM, Wed - 21 August 24

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (Chiranjeevi Birthday) సందర్భంగా రేపు ఆయన హిట్ మూవీల్లో ఒకటైన ‘ఇంద్ర’ రీరిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ‘అమ్మడు అప్పచీ’ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ వీడియోలో రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్ కనిపించారు. రామ్ చరణ్ సినిమా షూటింగ్ తీరును ఆసక్తిగా గమనిస్తుండడం వీడియో లో చూడొచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం టాలీవుడ్ రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. అగ్ర హీరోల చిత్రాలే కాదు సూపర్ హిట్ అయినా గత చిత్రాలను మళ్లీ సరికొత్త టెక్నలాజి తో రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు. చిరంజీవి , బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్, అల్లు అర్జున్ , రామ్ చరణ్ , నాగార్జున , రవితేజ ఇలా చాలామంది హీరోలు నటించిన గత చిత్రాలను వారి వారి బర్త్డే లకు రీ రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలో రేపు ఆగస్టు 22 చిరంజీవి బర్త్ డే. ఈ సందర్బంగా ఇంద్ర మూవీని రీ రిలీజ్ కాబోతుంది. శనివారం (ఆగస్ట్ 17) నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
2002లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్లోని అతిపెద్ద హిట్స్ లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, ముకేశ్ రిషి కూడా తమ నటనతో మెప్పించారు. అలాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ ఇప్పుడు మరోసారి 4కే వెర్షన్ లో రీరిలీజ్ కానుండటం మెగా అభిమానుల్లో ఆనందం నింపుతోంది. ఈసారి చిరు బర్త్ డేను మరింత ఘనంగా, మరుపురాని విధంగా జరుపుకోవడానికి లక్షల మంది ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు.
Read Also : Mosquito Bite : మీకు ఈ అలవాట్లు ఉన్నాయా ? అయితే దోమలతో ఇబ్బందే