Indian Movies – Japan : జపాన్‌లో దుమ్ము లేపేందుకు ఇండియా సినిమాలు రెడీ
జపాన్‌లో మనదేశ మూవీస్ బాగానే నడుస్తుంటాయి. అక్కడి ప్రజలు చాలా ఇష్టంగా మన మూవీస్ చూస్తుంటారు.
- By Pasha Published Date - 04:13 PM, Thu - 4 July 24

Indian Movies – Japan : జపాన్‌లో మనదేశ మూవీస్ బాగానే నడుస్తుంటాయి. అక్కడి ప్రజలు చాలా ఇష్టంగా మన మూవీస్ చూస్తుంటారు. ప్రత్యేకించి జపాన్‌లో రజినీకాంత్, జూనియర్ ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్, ప్రభాస్‌కు మంచి ఆదరణ ఉంది. ఈనెలలో కొన్ని ఇండియన్ మూవీస్ జపాన్‌లో సందడి చేయబోతున్నాయి. అవి భారీ కలెక్షన్లు చేస్తాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇంతకీ ఆ మూవీస్ ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
ప్రభాస్ ఇప్పుడు ప్రపంచ స్థాయి స్టార్‌గా మారాడు. పాన్ ఇండియా రేంజును మించి ఆయన ఎదిగిపోయాడు. ఆయన నటించిన హిట్ మూవీ సాలార్. ఇప్పటికే ఈ మూవీ రూ.715 కోట్ల కలెక్షన్లు చేసింది. పెట్టుబడి పెట్టిన దాని కంటే దాదాపు రూ.500 కోట్లు ఎక్కువే ఈ మూవీతో నిర్మాతకు ఆదాయం వచ్చింది. సాలార్ మూవీ రేపు (జులై 5న) జపాన్‌లో రిలీజ్ కానుంది. ఇప్పటికే అక్కడ రిలీజ్ చేసిన ట్రైలర్‌కు(Indian Movies – Japan) విశేష స్పందన వచ్చింది. దీంతో మూవీ కూడా బాగానే ఆడుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. సాలార్ మూవీ మనదేశంలో గతేడాది డిసెంబరు 22నే రిలీజ్ అయింది.
Also Read :CJI – Stock Markets : బీ అలర్ట్.. రాకెట్ స్పీడుతో స్టాక్ మార్కెట్లు : సెబీకి సీజేఐ సూచన
ప్రఖ్యాత నటుడు షారుక్ ఖాన్ మూవీ జవాన్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీ నవంబరు 29న జపాన్‌లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ దాదాపు రూ.1000 కోట్ల కలెక్షన్లు చేసింది. ఈ మూవీలో నయనతార, ప్రియమణి కూడా నటించారు. జవాన్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి (జులై 5) నుంచి మొదలుకాబోతున్నాయి. ఈ మూవీకి టికెట్లు ఎలా సేల్ అవుతాయి ? జపాన్ సినీ ప్రియులు ఎలా ఆదరిస్తారు ? అనేది వేచిచూడాలి. ఈమూవీ మన ఇండియాలో గతేడాది సెప్టెంబరు 7న విడుదలైంది.