Indian 2 : విజయవాడలో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్?
శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ తో ప్రపంచంలో లోని అనేక లొకేషన్స్ తో తెరకెక్కిస్తారు. ఇప్పటికే ఇండియన్ 2 సినిమా భారతదేశంలోని కొన్ని ప్రదేశాలతో పాటు....
- Author : News Desk
Date : 09-11-2023 - 6:36 IST
Published By : Hashtagu Telugu Desk
డైరెక్టర్ శంకర్(Director Shankar) దర్శకత్వంలో కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2(Indian 2) తీస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ పాత్రని కంటిన్యూ చేస్తూ ఈ కథ ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. కమల్ తో పాటు సిద్దార్థ్, బాబీ సింహ, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్.. ఇలా చాలామంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారు.
ఇక శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ తో ప్రపంచంలో లోని అనేక లొకేషన్స్ తో తెరకెక్కిస్తారు. ఇప్పటికే ఇండియన్ 2 సినిమా భారతదేశంలోని కొన్ని ప్రదేశాలతో పాటు సింగపూర్, మలేషియా, ఆఫ్రికా.. దేశాల్లో కూడా షూటింగ్ జరుపుకుంది. గతంలో ఏపీలోని రాయలసీమ ప్రాంతాల్లో ఇండియన్ 2 షూటింగ్ జరిగింది. తాజాగా మరోసారి ఇండియన్ 2 సినిమా ఏపీలో షూటింగ్ జరుగుతుంది.
విజయవాడలో కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ జరగబోతుందని సమాచారం. విజయవాడ గాంధీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ షూట్ ఉండబోతున్నట్టు, ఇప్పటికే అక్కడ కొన్ని ఏరియాలను బ్లాక్ చేసినట్టు తెలుస్తుంది. నాలుగు రోజుల పాటు విజయవాడలో ఇండియన్ 2 షూటింగ్ జరగబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం ఇండియన్ 2 సినిమా విడుదల కానుంది.
Also Read : Samantha : భూటాన్ లో సమంత ఆయుర్వేదం చికిత్స.. ఆరోగ్యం, ప్రశాంతత కోసం..