Rakul Preet Singh: ఇండియన్ 2 నా కెరీర్ లో స్పెషల్ మూవీస్ లో ఒకటి: రకుల్
- By Balu J Published Date - 09:57 PM, Sat - 8 June 24
Rakul Preet Singh: విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2′ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సాలిడ్ బజ్ ఉంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ సహా భారీ తారాగణం నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి మాట్లాడింది.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ “ఇండియన్ 2 నా కెరీర్ లో స్పెషల్ మూవీస్ లో ఒకటి. దానికి జత చేసిన పెద్ద పేర్ల వల్ల కాదు, నా క్యారెక్టరైజేషన్ రాసుకున్న విధానం ప్రత్యేకం. తనకేం కావాలో బాగా తెలిసిన ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిగా నటిస్తున్నా. భారతీయుడు 2లో నా పాత్రకు, నా వ్యక్తిగత జీవితానికి చాలా పోలికలు ఉన్నాయి. ప్రస్తుతానికి అంతకుమించి వెల్లడించలేను’ అని పేర్కొన్నారు. మాస్టర్ కథకుడు శంకర్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని రకుల్ తెలిపింది.
Related News
Johnny Master: ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా
Johnny Master: నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్ స్థాయి పాన్ ఇండియా లెవల్ సినిమాల వరకు వెళ్ళింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేస్తున్నారు. మరోవైపు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షుడిగా డ్యాన్సర్స్ అభివృద్ధికి పాటు పడుతున్నారు. అయితే… ఇటీవల సతీష్ అనే డ్యాన్సర్ జానీ మాస్టర్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర�