Ileana D’Cruz: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా
గోవా బ్యూటీ ఇలియానా తల్లిగా ప్రమోట్ అయింది. ఆగస్టు 1వ తేదీన ఇల్లీబేబి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె ఐదు రోజుల తరువాత తనకు బిడ్డ పుట్టినట్టు ప్రకటించింది.
- Author : Praveen Aluthuru
Date : 06-08-2023 - 12:47 IST
Published By : Hashtagu Telugu Desk
Ileana D’Cruz: గోవా బ్యూటీ ఇలియానా తల్లిగా ప్రమోట్ అయింది. ఆగస్టు 1వ తేదీన ఇల్లీబేబి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె ఐదు రోజుల తరువాత తనకు బిడ్డ పుట్టినట్టు ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా తనకు మగ బిడ్డ పుట్టినట్టు ప్రకటించింది. అంతేకాదు బాబు పేరు వెరైటీగా కోవా ఫోనిక్స్ డోలన్ అంటూ పేరు పెట్టేసింది. అయితే బిడ్డకు కారణం ఎవరు అన్నది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. పెళ్లి విషయంలో గోప్యత పాటించింది. ప్రెగ్నెన్సీ విషయంలోనూ అదే సూత్రం ఫాలో అయింది. ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చిన అయిదు రోజుల తరువాత రివీల్ చేసింది. అయితే ఇదంతా ఆమె పర్సనల్ విషయమే కావచ్చు. కాకపోతే పబ్లిక్ ఫిగర్ అని చెప్పుకుంటున్నప్పుడు కొన్నిసార్లు పర్సనల్ విషయాలు కూడా ప్రయివేట్ గా మారిపోతాయి.
రామ్ హీరోగా నటించిన దేవదాసు చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఇలియానా మహేశ్ బాబు పోకిరితో భారీ హిట్ అందుకుంది. ఆ తరువాత స్టార్ హీరోల సరనస నటించే అవకాశం దక్కించుకుంటూ అనతికాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు హిందీలోనూ విజయాలు అందుకుంది. ప్రస్తుతం ఇల్లీబేబి సినిమాలకు దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ ని ఎంజాయ చేస్తుంది.
Also Read: TSRTC Merger Bill : అయ్యో…ఆర్టీసీ (RTC) విలీనం బిల్లు లేనట్లేనా..?