Shah Rukh Khan: షారుక్ ఖాన్ కు కోపం వస్తే అంతే మరి!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- By Balu J Published Date - 01:28 PM, Wed - 3 May 23
ఒకప్పుడు అభిమాన హీరోలు (Stars), హీరోయిన్స్ కనబడితే ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంటూ వెంటపడేవారు అభిమానులు. ఇప్పుడు 2023 కదా.. ఓన్లీ సెల్పీలు అంటూ చిరాకు తెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan) వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెల్ఫీకి షారుఖ్‌ను అడక్కుండానే.. పక్కన నడుస్తూ మొబైల్‌తో ఫొటో తీయడానికి ప్రయత్నించాడు ఓ అభిమాని.
ఇది షారుక్ కు చికాకు తెప్పించింది. వెంటనే ఆ అభిమానిని పక్కకు నెట్టేశాడు. ఈ వీడియో (Video) సోషల్ మీడియాలోకి వైరల్ అవుతుంది. అభిమానితో షారుఖ్ దురుసుగా ప్రవర్తించాడంటూ కొందరు ఆయన్ని విమర్శిస్తుంటే.. కనీసం సెల్ఫీ కోసం పర్మిషన్ కూడా అడక్కుండా ఆ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.
సినిమా హీరోలు కనబడితే వారిని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు అబిమానులు (Fans) ఎగబడటం సాధారణం. ఐతే ఆ హీరోలు ఎలాంటి మూడ్‌లో ఉన్నారు.. మనం వారిని ఎక్కడ కలిశాం.. వారి ప్రైవసీ సంగతేంటి.. ఇలాంటివన్నీ కొంచెం చూస్కోవాలి. ఫొటోలు, సెల్ఫీలు దిగేటపుడు కనీసం అనుమతి అడగాలి కదా ఆయన అభిమానులు షారుక్ ఖాన్ కు సపోర్ట్ చేస్తున్నారు.
Also Read: Rashmika and Bellamkonda: రష్మిక తో డేటింగ్.. బెల్లంకొండ రియాక్షన్ ఇదే!
Related News
Shah Rukh Khan : బాలీవుడ్ ‘అల్లుడు’ విరాట్ కోహ్లీ
కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) సహ యజమాని, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ స్టైలిష్ ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీని "నేను అతనిని ప్రేమిస్తున్నాను" అంటూ ప్రశంసలు కురిపించాడు.