HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Iconic Hollywood Sign Turns 100 Years

Hollywood – 100 Years : హాలీవుడ్ సైన్ బోర్డ్ 100వ బర్త్ డే.. ఎంత చరిత్ర ఉందంటే ?

Hollywood - 100 Years : ప్రపంచ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పదం.. ‘హాలీవుడ్’ !!

  • By Pasha Published Date - 09:07 AM, Sun - 10 December 23
  • daily-hunt
Hollywood 100 Years
Hollywood 100 Years

Hollywood – 100 Years : ప్రపంచ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పదం.. ‘హాలీవుడ్’ !! ‘హాలీవుడ్’ పేరుతో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఏర్పాటు చేసిన సైన్ బోర్డు రెండు రోజుల కిందటే (శుక్రవారం) 100వ బర్త్ డేను జరుపుకుంది. ఈ సైన్ బోర్డును 1923లో ఏర్పాటుచేశారు. తొలినాళ్లలో దీన్ని ‘హాలీవుడ్‌ ల్యాండ్’ అని పిలిచేవారు. లాస్ ఏంజిల్స్‌ నగర రియల్ ఎస్టేట్  డెవలప్మెంట్ ప్లాన్‌లో భాగంగా హాలీవుడ్ సైన్ బోర్డును ఏర్పాటు చేశారు. ఆ ప్లాన్ సక్సెస్ అయింది. సినిమా నిర్మాణ రంగానికి ప్రపంచ హబ్‌గా హాలీవుడ్ మారింది. లాస్ ఏంజిల్స్‌‌కు వెళ్లే టూరిస్టులు, సినీ ప్రియులు తప్పకుండా ఈ సింబల్‌ను చూస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

సైన్ బోర్డు.. ఆసక్తికర విశేషాలు

  • ‘హాలీవుడ్’ సైన్ బోర్డును లాస్ ఏంజిల్స్ రియల్ ఎస్టేట్ ప్రచారం కోసం ఏర్పాటు చేసిన తొలినాళ్లలో వేలాది బల్బులతో డెకొరేట్ చేసేవారు.
  • 1940 నాటికి మెయింటెనెన్స్ లేక సైన్ బోర్డులోని అక్షరాలన్నీ చెదిరిపోయి గజిబిజిగా పడిపోయాయి.
  • 1940వ దశకంలోనే గాలి తుఫానులకు సైన్ బోర్డులోని H అనే అక్షరం దెబ్బతింది. బాగా దెబ్బతిన్న ఆ బోర్డును తీసేయమని స్థానికులు రియల్ ఎస్టేట్ వాళ్లకు సూచించారు.
  • సరిగ్గా ఇదే టైంలో హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘హాలీవుడ్’ అనే పదాన్ని తమ ట్రేడ్‌మార్క్‌గా వాడుకోవచ్చని డిసైడ్ అయ్యింది.
  • హాలీవుడ్ సైన్ బోర్డును 1949లో హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిపేర్ చేయించింది.
  • 1978లో హాలీవుడ్ సైన్ బోర్డు పునరుద్ధరణ కోసం అమెరికన్ సింగర్ ఆలిస్ కూపర్‌ రూ.23 లక్షలను విరాళంగా ప్రకటించాడు.
  • హాలీవుడ్ సైన్ బోర్డు నిర్వహణ కోసం ప్రత్యేక  ట్రస్ట్ ఏర్పాటయింది. దీనిపేరే  హాలీవుడ్ సైన్ ట్రస్ట్ .
  • హాలీవుడ్ సైన్ బోర్డు పెయింటింగ్ కోసం ఏటా 400 గ్యాలన్ల (1,500 లీటర్లు) పెయింట్, ప్రైమర్‌ను వాడుతారు.
  • చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. 1932లో ఈ సైన్ బోర్డు(Hollywood – 100 Years) ఒక విషాద ఘటనకు కూడా వేదికగా మారింది. ఈ సైన్ బోర్డులోని H అక్షరం పై నుంచి దూకి బ్రిటీష్ సంతతికి చెందిన నటి పెగ్ ఎంట్విస్టిల్ తన ప్రాణాలను తీసుకుంది.

Also Read: Shooters Arrested : మర్డర్ చేసి మనాలీకి వెళ్లారు.. కర్ణి సేన చీఫ్ హంతకులు దొరికారు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hollywood
  • Hollywood - 100 Years
  • Hollywood Sign

Related News

    Latest News

    • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

    • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd