Hit 3 Teaser : నాని ‘హిట్ 3’ టీజర్ ..మాములు షాకులు కాదు
Hit 3 Teaser : శ్రీనగర్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. అక్కడ జరిగే వరుస హత్యలు.. పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ వాటిని ఎలా ఛేదించాడు
- By Sudheer Published Date - 12:55 PM, Mon - 24 February 25

న్యాచురల్ స్టార్ నాని (Nnai) వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. దసరా, హాయ్ నాన్న , సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న నాని..ప్రస్తుతం హిట్ 3 (HIT 3)చేస్తున్నాడు. ఈ మూవీ లో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. శైలేశ్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. 2025 మే 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈరోజు సోమవారం నాని పుట్టిన రోజు సందర్భగా టీజర్ రిలీజ్ చేసి సినిమా పై ఆసక్తి నింపారు.
టీజర్ మొత్తం ట్విస్ట్ లతో కట్ చేసి ఆకట్టుకున్నారు. శ్రీనగర్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. అక్కడ జరిగే వరుస హత్యలు.. పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ వాటిని ఎలా ఛేదించాడు అనే కోణంలో ఈ సినిమా ఉండనుంది. ఊర మాస్ పోలీస్ గా నాని అదరగొట్టాడు. రావు రమేష్ లాంటి ఒకరిద్దరిని తప్ప ఇతర పాత్రధారులను రివీల్ చేయకుండా టీజర్ కట్ చేశారు. మిక్కీ జె మేయర్ బీజీఎం మరో స్థాయిలో ఉంది. మొత్తానికి ‘హిట్ 3 ది థర్డ్ కేస్’ ఆషామాషీగా ఉండదని మాత్రం అర్థమైపోయింది. ఇక ఈ మూవీ లో నాని సరసన శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుంది.