HHVM : వీరమల్లు ‘ఆరు’ రోజుల కలెక్షన్స్ ..ఇంత దారుణమా..?
HHVM : రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందు భారీ హైప్‌ను సృష్టించినప్పటికీ, తుది ఫలితాల్లో మాత్రం నిరాశనే మిగిల్చింది
- By Sudheer Published Date - 01:39 PM, Wed - 30 July 25

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై , వీకెండ్‌లో కొంత ఊపు చూపించినప్పటికీ వర్కింగ్ డేస్‌లో మాత్రం పూర్తిగా పేలవమైన కలెక్షన్లను నమోదుచేసింది. రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందు భారీ హైప్‌ను సృష్టించినప్పటికీ, తుది ఫలితాల్లో మాత్రం నిరాశనే మిగిల్చింది. మొదటి రోజు వచ్చిన కలెక్షన్లతో సినిమాపై కొన్ని ఆశలు వెలిగినా, ఆ తర్వాత వాటిని నిలబెట్టుకోవడంలో సినిమా విఫలమైంది.
ప్రీమియర్ల ద్వారా రూ.12.75 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఫస్ట్ డే నాడు రూ.34.75 కోట్లు వసూలు చేసి పవన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. కానీ రెండో రోజు నుంచే డ్రాప్ కనిపించడంతో సినిమాకు మౌత్ టాక్ దెబ్బ గట్టిగా పడింది. రెండో రోజు రూ.8.79 కోట్లు, మూడో రోజు రూ.9.15 కోట్లు, నాలుగో రోజు రూ.10.6 కోట్లు వసూలవ్వగా, వీకెండ్ వరకు కనీస స్థాయిలో ట్రాక్‌లో ఉన్నట్లే కనిపించింది.
Telangana : గొర్రెల పంపిణీ కుంభకోణం కేసు..హైదరాబాద్‌లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు
అయితే సోమవారం నుంచి సినిమా కలెక్షన్స్ పరిస్థితి దారుణానికి వచ్చింది. ఐదో రోజు కేవలం రూ.2.1 కోట్ల నెట్ వసూళ్లే నమోదు కాగా, ఆరో రోజు ఈ సంఖ్య మరింత తగ్గి ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.1.80 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ డిప్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గినట్టుగా స్పష్టం చేస్తోంది. భారీ ప్రమోషన్‌లు, పవన్ స్టార్ ఇమేజ్‌తో వచ్చిన హైప్ బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయింది.
మొదటి ఆరు రోజుల్లో ఇండియా వైడ్‌గా రూ.78 కోట్ల నెట్, రూ.91 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఈ వసూళ్లు రూ.250 కోట్ల బడ్జెట్‌కు ఏమాత్రం సరిపోకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా నిలుస్తోంది. బ్రేక్ ఈవెన్‌కు చేరాలంటే ఇంకా చాలా పెద్ద దూరం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక పవన్ కెరియర్ లో మరో డిజాస్టర్ గా ఈ మూవీ నిలిచిపోవడం ఖాయమని తెలుస్తుంది.