Mrunal Thakar : వామ్మో.. మృణాల్ అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందా?
సీతారామం సినిమాలో తన నటనతో, తన చూపులతో పద్దతిగా చీరల్లో కనిపించి తన అందంతో ప్రేక్షకులని మెప్పించి భారీగా అభిమానులని సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్.
- By News Desk Published Date - 08:00 PM, Sun - 9 July 23

మృణాల్ ఠాకూర్(Mrunal Thakar).. ప్రస్తుతం స్టార్ హీరోయిన్. వరుసగా తెలుగు, హిందీలో సినిమాలు చేస్తోంది. కానీ ఒకప్పుడు 2012 నుంచే బాలీవుడ్(Bollywood) సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి అనంతరం సీరియల్స్, సినిమాలు, పలు షోలు చేస్తూ వచ్చింది. కానీ తెలుగులో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) తో చేసిన సీతారామం(Sitaramam) సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.
సీతారామం సినిమాలో తన నటనతో, తన చూపులతో పద్దతిగా చీరల్లో కనిపించి తన అందంతో ప్రేక్షకులని మెప్పించి భారీగా అభిమానులని సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఒక్కసారిగా మరింత వైరల్ అయింది. ఇక వరుస సినిమా ఆఫర్లు పట్టేసింది. ప్రస్తుతం మృణాల్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. ఇటీవలే లస్ట్ స్టోరీస్ తో బోల్డ్ కంటెంట్ లో కూడా అలరించింది.
ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా చేసినా కోటి రూపాయలు కూడా తీసుకొని మృణాల్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోవడంతో బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్లు తీసుకుంటుంది. ఇక తెలుగులో అయితే దాదాపు 2 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో వామ్మో అని ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. మొత్తానికి పదేళ్లు కష్టపడితే ఇప్పటికి దశ తిరిగింది అని అభినందించేవాళ్ళు కూడా ఉన్నారు.
Also Read : Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?