HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄Cinema
  • ⁄Hero Karthikeya Full Interview Special

Interview : ఆ టైటిల్ పెట్టానని చిరంజీవిగారికి చెబితే.. ‘గుడ్ లక్’ అన్నారు!

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండకు ధైర్యం ఎక్కువ. ఆయన పేరు చెబితే ముందు 'ఆర్ఎక్స్ 100' గుర్తుకు వస్తుంది. అటువంటి న్యూ ఏజ్ సినిమా చేయడానికి ధైర్యం కావాలి. కార్తికేయకు ఉంది కాబట్టే ఆ సినిమా చేశారు.

  • By Balu J Published Date - 03:37 PM, Tue - 9 November 21
  • daily-hunt
Interview : ఆ టైటిల్ పెట్టానని చిరంజీవిగారికి చెబితే.. ‘గుడ్ లక్’ అన్నారు!

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండకు ధైర్యం ఎక్కువ. ఆయన పేరు చెబితే ముందు ‘ఆర్ఎక్స్ 100’ గుర్తుకు వస్తుంది. అటువంటి న్యూ ఏజ్ సినిమా చేయడానికి ధైర్యం కావాలి. కార్తికేయకు ఉంది కాబట్టే ఆ సినిమా చేశారు. హీరోగా ‘ఆర్ఎక్స్ 100’ వంటి విజయం తర్వాత విల‌న్‌గా నటించడానికి ధైర్యం కావాలి. ‘గ్యాంగ్ లీడర్’లో స్ట‌యిలిష్‌ విల‌న్‌గా నటించారు. ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘చావు కబురు చల్లగా’ వంటి వైవిధ్యమైన సినిమా చేశారు. ‘రాజా విక్ర‌మార్క‌’లో ఎన్ఐఏ ఏజెంట్‌గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా, తాన్యా రవిచంద్రన్ కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తికేయతో ఇంటర్వ్యూ…

*ప్రశ్న: ‘రాజా విక్రమార్క’గా కార్తికేయ ఎలా ఉంటారు?*
నేను ఇప్పటివరకూ ఇంత కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఇందులో యాక్షన్ కూడా స్ట‌యిలిష్‌గా ఉంటుంది.ఎన్ఐఏ ఏజెంట్‌గా డ్ర‌స్సింగ్ కూడా క్లాసీగా ఉంటుంది. ఇప్పటివరకూ నేను టచ్ చేయని జానర్ సినిమా. రెండున్నర గంటలు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠతో ఆటు వినోదం కూడా ఉంటుంది. ప్రతి పాత్ర, వినోదం కథలో భాగం గానే ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉంటాయి. మా ’88’ రామారెడ్డి, ఆదిరెడ్డిగారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశా. వాళ్లకు తొలి సినిమా అయినా ఖర్చుకు వెనుకాడలేదు. రెండు కరోనా వేవ్స్ వచ్చినా… థియేటర్లలో రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. వాళ్లు ఇచ్చిన మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువే.

*ప్రశ్న: కామెడీ… యాక్షన్… రెండిటిలో ఏది కష్టంగా అనిపించింది?*
ఆల్రెడీ యాక్షన్ చేశాను కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. యాక్షన్ చేసినంత ఎక్కువగా కామెడీ చేయలేదు. ఈ మూవీలో ఉన్నట్టు చేయలేదు. కష్టం అని కాదు గానీ… నా మీద హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెన్స్ రాలేదు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అని క్యూరియాసిటీ ఉంది. బేసిగ్గా… నేను బయట చాలా జోవియ‌ల్‌గా ఉంటాను. జోక్స్ వేయడం, ఫ్రెండ్స్ మీద పంచ్ డైలాగ్స్ వేయడం ఎక్కువ. అందువల్ల, కామెడీ చేయడం కష్టం ఏమీ అనిపించలేదు. బయట ఎలా ఉంటానో అలా నటిస్తే క్యారెక్టర్ చేయవచ్చని అనిపించింది. డైరెక్టర్ కూడా అదే చెప్పాడు. ట్రైలర్ విడుదలయ్యాక కామెడీ టైమింగ్ బావుందని చెప్పినప్పుడు హ్యాపీగా ఫీలయ్యా.

*ప్రశ్న: ‘ఆర్ఎక్స్ 100’ టైమ్‌లో క‌థ విన్నాన‌ని చెప్పారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్?*
కథ డీల్ చేసిన విధానం. బేసిగ్గా… కామెడీ బేస్ చేసుకుని యాక్షన్ సినిమా ఇది. వీటన్నిటి కంటే దర్శకుడి మీద నమ్మకం వచ్చింది. శ్రీ సరిపల్లి కథను నేరేట్ చేశాక… పది నిమిషాలు మాట్లాడిన తర్వాత అతను చేయగలడని నమ్మకం వచ్చింది. హానెస్ట్ పర్సన్ అనిపించాడు. స్క్రిప్ట్ నచ్చింది. అయితే… సినిమా చూస్తే గానీ చెప్పలేం. అటువంటి స్క్రిప్ట్. వినడానికి బావుంటుంది. కానీ, కరెక్ట్ విజువల్, మ్యూజిక్ పడినప్పుడు స్క్రీన్ మీద చూడటానికి బావుంటుంది. మేకింగ్ డిపెండ్ అయిన సినిమా. శ్రీని కలిసినప్పుడు అతను చేయగలడని అనిపించింది. ఒక్కో షెడ్యూల్ అవుతున్నప్పుడు నా నమ్మకం మరింత బలపడింది.

*ప్రశ్న: తొలిసారి ఎన్ఐఏ ఏజెంట్ రోల్ చేశారు. స్పెషల్ ప్రిపరేషన్ ఏమైనా…*
ఎన్ఐఏ ఏజెంట్ అంటే… బోర్డ‌ర్‌లో జ‌రిగే క‌థ కాదు. దేశం లోపల జరిగే కథ. దర్శకుడితో కూర్చుని చేసిన డిస్కషన్స్ ఎక్కువ. కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ… అన్నీ డిస్కస్ చేశా. గన్ ఎలా పట్టుకోవాలి? వంటి విషయాల్లో రీసెర్చ్ చేశా.

*ప్రశ్న: ‘రాజా విక్రమార్క’… చిరంజీవిగారి టైటిల్. మీరే సజెస్ట్ చేశానని చెప్పారు. రీజన్ ఏంటి?*
శ్రీ ముందు ఏదో టైటిల్ చెప్పాడు. ఒక రోజు అతని ఫోనులో ఈ టైటిల్ చూశా. బావుందని ఫీలయ్యా. ‘రాజా విక్రమార్క’ టైటిల్ సౌండింగ్ లో ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పాజిటివిటీ… చిరంజీవిగారి టైటిల్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. దర్శకుడికి చెప్పిన తర్వాత ఒక రోజు టైమ్ తీసుకుని సరే అన్నాడు.

*ప్రశ్న: చిరంజీవిగారికి టైటిల్ గురించి చెప్పారా?*
టైటిల్ పెట్టిన తర్వాత చెప్పాను. ముందు టైటిల్ దొరుకుతుందో? లేదో? అని చెక్ చేశాం. టైటిల్ ఉందని తెలిశాక రిజిస్టర్ చేశా. తర్వాత ఆయనకు పంపించాను. ‘గుడ్ లక్’ అని చెప్పాను. మెగాస్టార్ అభిమానిగా ఆయన టైటిల్ నా సినిమాకు పెట్టుకున్నానని ఒక సంతోషం. ఆయన సినిమా టైటిల్స్ అన్నీ ఆయనవే. కొంతమంది అభిమానులు పిల్లలకు తమ అభిమాన హీరో పేరు పెట్టుకుంటారు. అలా అభిమానంతో పెట్టుకున్నాను.

*ప్రశ్న: ‘రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్‌లో ప్రేక్షకులు గర్వపడే సినిమాలు చేస్తానని అన్నారు!

ఇమేజ్, మార్కెట్ అంటూ భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటే… తెలియకుండా ఒత్తిడిలోకి వెళ్లి కథలో బేసిక్ పాయింట్స్ మిస్ అవుతున్నాను. ఓ ప్రేక్షకుడిగా కథ విని, ఆ సినిమాను ఎలా హిట్ చేయాలి? అనేది ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఎంత పెద్ద హిట్ అవుతుందనేది పక్కన పెడితే… ముందు మంచి సినిమా అవుతుంది. మినిమమ్ హిట్ అవుతుంది. అలా వెళుతూ ఉంటే మంచి సినిమాలు వస్తాయి. నా సినిమా ఫలితాల్ని విశ్లేషించి ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటున్నాను. ఓ ప్రేక్షకుడిగా కథ విని ‘రాజా విక్రమార్క’ చేశా. స్క్రీన్ ప్లే, మేకింగ్, కెమెరా వర్క్, లొకేషన్స్… గత సినిమాల్లో జరిగిన మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకున్నాను.

*ప్రశ్న: మీలో ప్రేక్షకుడికి ఎటువంటి సినిమాలు నచ్చుతాయి?*
ఒక జానర్ అన్నట్టు ఏమీ లేదు. అన్ని జానర్ సినిమాలు చూస్తాను. రీసెంట్ గా ‘డాక్టర్’ చూశా. చాలా బాగా అనిపించింది. ‘అరే… భలే ఉందే. ఇటువంటి సినిమా మనం ఎప్పుడూ చూడలేదు. మనం ఇటువంటి సినిమాలు చేయాలి’ అనిపించింది. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. దాని ప్రకారం కథలు సెలెక్ట్ చేసుకోవాలి. సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో డిఫరెంట్ ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారు. వాళ్లను, ఇప్పుడున్న ట్రెండ్ గమనిస్తూ… సినిమాలు చేయాలి.

*ప్రశ్న: మీ బాడీ గురించి కూడా చాలామంది మాట్లాడతారు. బాడీ మెయింటైన్ చేయడం ఎంత కష్టం? బాడీ వల్ల ఎన్ని ఛాన్సులు వచ్చాయి?*
నా బాడీ, ఫిజిక్ వల్లే ‘ఆర్ఎక్స్ 100’ ఛాన్స్ వచ్చింది. అజయ్ భూపతిని ‘సార్! నేను మీకు ఎలా తెలుసు? నేను యాక్టింగ్ చేస్తానని…’ అని అడిగా. ‘అవన్నీ నాకు తెలియదు. నీకు బాడీ ఉందని తీసుకున్నాను. యాక్టింగ్ నేను చేయించుకుందామని అనుకున్నాను. అంతే’ అన్నాడు. తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ అప్పుడు దర్శకుడు విక్రమ్ కె. కుమార్‌తో ‘నన్ను ఎందుకు తీసుకున్నారు?’ అని అడిగా. ‘నీకు మంచి బాడీ ఉంది’ అన్నారు. ఇప్పుడు ‘వలిమై’లో కూడా అందుకే తీసుకున్నారు. బాడీ వల్ల నాకు చాలా ఛాన్సులు వచ్చాయి. దర్శకులు నన్ను ఎంపిక చేసుకోవడానికి కారణం ఏదైనా అవ్వొచ్చు. బాడీ ఉందని నన్ను తీసుకున్నానని చెప్పిన ముగ్గురు దర్శకులు… నా నటన చూసినప్పుడు, ఎమోషనల్ సీన్స్ చేసినప్పుడు, నటనలో ఇంటెన్స్ చూసి స‌ర్‌ప్రైజ్‌ అయ్యామని చెప్పారు. ఫిజిక్ ఉండటం నాకు అడ్వాంటేజ్ అయ్యింది. దాని వల్ల రోల్స్ వచ్చాయి. బాడీ అలా మెయింటైన్ చెయ్యడం కష్టమే. అయితే… అవకాశాలు వస్తున్నప్పుడు పర్లేదు. కష్టం పడొచ్చు.

*ప్రశ్న: ‘రాజా విక్రమార్క’లో సిక్స్ ప్యాక్ చూపించారా?*
ప్రస్తుతానికి అయితే గన్స్, యాక్షన్! సిక్స్ ప్యాక్ గురించి చూద్దాం. ఇప్పుడే అయితే నేను ఏమీ చెప్పను. సిక్స్ ప్యాక్ చూపించానో? లేదో? సినిమాలో చూడాలి.

*ప్రశ్న: ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు?*
యువి క్రియేషన్స్ సంస్థలో ఒక సినిమా చేస్తున్నాను. తర్వాత క్లాక్స్ అని అబ్బాయి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను. శివలెంక కృష్ణప్రసాద్ గారి శ్రీదేవి మూవీస్ సంస్థలో ఓ సినిమా ఓకే అయ్యింది. అన్నీ డిఫరెంట్ జానర్ సినిమాలు. ‘వలిమై’ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అందులో నటించడం వల్ల తమిళం నుంచి అవకాశాలు వస్తున్నాయి.

Tags  

  • hero karthikeya
  • interview
  • Raja Vikramarka
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Exclusive: ‘ఆర్ఎక్స్ 100’కి, ‘బెదురులంక 2012’కు యాదృశ్చికంగా అలా కుదిరింది – హీరో కార్తికేయ ఇంటర్వ్యూ

Exclusive: ‘ఆర్ఎక్స్ 100’కి, ‘బెదురులంక 2012’కు యాదృశ్చికంగా అలా కుదిరింది – హీరో కార్తికేయ ఇంటర్వ్యూ

కథకు బాగా కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. కథలో కొత్తదనం, వినోదం ఉండటంతో ఓకే చేశా.

  • Bedurulanka 2012: కార్తికేయ, నేహా శెట్టిల ‘బెదురులంక 2012’ రిలీజ్ కు సిద్ధం!

    Bedurulanka 2012: కార్తికేయ, నేహా శెట్టిల ‘బెదురులంక 2012’ రిలీజ్ కు సిద్ధం!

  • MLA Gudem Mahipal Reddy: తెలంగాణ కాంగ్రెస్ కు జెండా.. ఎజెండా లేదు  గూడెం మహిపాల్ రెడ్డి సంచలన కామెంట్స్

    MLA Gudem Mahipal Reddy: తెలంగాణ కాంగ్రెస్ కు జెండా.. ఎజెండా లేదు గూడెం మహిపాల్ రెడ్డి సంచలన కామెంట్స్

  • Keerthy Suresh: వెన్నెల అందరికి కనెక్ట్ అయ్యే పాత్ర.. నా కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్: కీర్తి సురేష్

    Keerthy Suresh: వెన్నెల అందరికి కనెక్ట్ అయ్యే పాత్ర.. నా కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్: కీర్తి సురేష్

  • Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది : విశ్వక్ సేన్

    Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది : విశ్వక్ సేన్

Latest News

  • Salt : రక్థ పోటు లేకున్నా ఉప్పు ఎక్కువగా తింటున్నారా..!

  • Tamilisai Vs Kcr : రాళ్లు విసిరితే ఇల్లు కట్టుకుంటా.. పిన్స్‌ వేస్తే రక్తంతో నా చరిత్ర పుస్తకం రాస్తా : గవర్నర్

  • MLC Kavitha: కల్వకుంట్ల కవితకు లండన్ బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం

  • M. S. Swaminathan: స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

  • Famous Tree: చెట్టుని నరికేస్తే అరెస్ట్ చేస్తారా? ప్రత్యేకత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Trending

    • Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు

    • Chandrababu Brand : ఏపీపై భారీ కుట్ర‌? రాష్ట్రానికి సంకెళ్లు.!

    • Ganesh Nimajjanam : వినాయక ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ? గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి ?

    • Weird Politics in AP : జ‌గ‌న్ కోసం MIM, BRS పోటీ?

    • Rs 2000 Note Exchange : 2వేల నోట్ల బదిలీ డెడ్ లైన్ ముంచుకొస్తోంది.. గడువు పొడిగిస్తారా ?

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version