Dhanush Gift To Parents: పేరెంట్స్ కు ప్రేమతో.. కోట్ల విలువైన ఇల్లు గిఫ్ట్!
ధనుష్ తన తల్లిదండ్రులు కస్తూరిరాజా, విజయలక్ష్మిలకు విలాసవంతమైన ఇంటి (Costly Home)ని బహుమతిగా ఇచ్చాడు.
- By Balu J Published Date - 03:18 PM, Mon - 20 February 23

తమిళ సూపర్ స్టార్ ధనుష్ (Dhanush) నటించిన తాజా చిత్రం ‘వాతి’ (తెలుగులో సార్) ఫిబ్రవరి 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన తల్లిదండ్రులు కస్తూరిరాజా, విజయలక్ష్మిలకు విలాసవంతమైన ఇంటి (Costly Home)ని బహుమతిగా ఇచ్చాడు. ఈ అందమైన, విలాసవంతమైన ఇల్లు చెన్నైలోని పోస్ గార్డెన్ లో ఉంది. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బంగ్లా కూడా ఉంది. ధనుష్ తన తల్లిదండ్రులకు విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చిన వార్తను ధనుష్ (Dhanush) అభిమానుల సంఘం అధ్యక్షుడు సుబ్రమణ్యం శివ వెల్లడించారు.
తమ్ముడు ధనుష్ కొత్త ఇల్లు నాకు గుడిలాంటి అనుభూతిని కలిగిస్తోందని శివ తమిళ ట్వీట్ (Tweet)లో పేర్కొన్నారు. జీవితకాలం గుర్తుండిపోయేలా తన తల్లిదండ్రులకు అందమైన ఇంటిని అందించాడు. మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రుల విషయంలో యువ తరానికి (Youth) స్ఫూర్తిదాయకంగా ఉండండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
ధనుష్ (Dhanush) జాతీయ అవార్డు పొందిన నటుడు. అసురన్, తిరుడా తిరుడా వంటి చిత్రాలు ఆయనను తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్‌గా మార్చాయి. సౌత్ ఇండియన్ మెగా స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ నుండి విడిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. తమ పిల్లలైన యాత్ర రాజా, లింగరాజుల కోసం వారు రాజీ పడ్డారని కూడా వార్తలు వచ్చాయి. రజనీకాంత్ ప్రయత్నాల వల్ల పెళ్లి సెటిల్ అయింది. ప్రస్తుతం ధనుష్ తన తల్లిదండ్రులకు ఇచ్చిన ఇంటి ఫొటోలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారాయి.
Also Read: Anupama Parameswaran: 27లోకి అడుగుపెట్టిన మలబార్ బ్యూటీ.. థ్యాంక్స్ అంటూ ట్వీట్!