Manchu Family Fight : మోహన్ బాబు – మనోజ్ గొడవకు కారణం అతడే – పనిమనిషి చెప్పిన అసలు నిజం
Manchu Family Fight : మోహన్ బాబు దగ్గర పనిచేసే ప్రసాద్ వల్లే మనోజ్ - మోహన్ బాబు మధ్య గొడవ వచ్చిందని ఆమె తెలిపింది. ప్రసాద్ చేసిన తప్పు కారణంగా మనోజ్ బెల్ట్ తీసుకోని ప్రసాద్ కొట్టాడని
- By Sudheer Published Date - 04:02 PM, Tue - 10 December 24

మోహన్ బాబు – మనోజ్ (Manchu Family Fight)మధ్య నడుస్తున్న గొడవ ఇప్పుడు మీడియా లో ట్రేండింగ్ గా నడుస్తుంది. నిన్నటి నుండి ప్రతి మీడియా ఛానల్ లోనే కాదు సోషల్ మీడియా లో , సినీ పరిశ్రమ లో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మోహన్ బాబు , మనోజ్ ఇద్దరు కూడా పోలీసులకు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం..ప్రాణ హాని ఉందంటూ రక్షణ కోరడంతో అసలు వీరి మధ్య ఏంజరిగింది..? ఏం జరుగుతుంది..? అని అరా తీస్తున్నారు. ఇదే క్రమంలో పలు వార్తలు కూడా బయటకు వస్తున్నాయి.
మంచు మనోజ్ .. మోహన్ బాబు రెండో భార్య కొడుకు కాబట్టే.. ఇలా వ్యవహరిస్తున్నారనీ, విష్ణును దగ్గరికి తీస్తూ.. మనోజ్ ను దూరం పెడుతున్నానని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని సినీ ప్రముఖులు చెపుతున్నారు. మోహన్ బాబు అలాంటి తారతమ్యాలను ఎన్నడూ చూపించలేదని, ఆయన పిల్లలు ఏ భార్య కొడుకులు కూడా ఇండస్ట్రీలో సరిగా తెలియదని, ఆ బేధం రాకుండా వారినీ చూసుకున్నారని పేర్కొన్నారు. మోహన్ బాబు రెండో భార్య కూడా పిల్లల పట్ల ఈనాడు వ్యత్యాసం చూపలేదని, తన అక్క బిడ్డల్ని చాలా బాగా చూసుకునేదని చెపుతున్నారు. మనోజ్ ప్రేమ వివాహాన్ని మోహన్ బాబు అంగీకరించలేదనీ, కానీ మొండికేసి మనోజ్ భూమా రెడ్డి కూతుర్ని పెళ్లి చేసుకోన్నారనీ, ఆమె మొదటి పెళ్లి సమయంలో విడాకులు తీసుకున్న విధానం నచ్చలేదని అందుకే ఆ పెళ్లికి మోహన్ బాబు అంగీకరించలేదని అది మాత్రం నిజం అంటున్నారు.
ఈ క్రమంలో మోహన్ బాబు ఇంట్లో పనిచేసే పనిమనిషి అసలు నిజాలు బయటపెట్టింది. మోహన్ బాబు దగ్గర పనిచేసే ప్రసాద్ వల్లే మనోజ్ – మోహన్ బాబు మధ్య గొడవ వచ్చిందని ఆమె తెలిపింది. ప్రసాద్ చేసిన తప్పు కారణంగా మనోజ్ బెల్ట్ తీసుకోని ప్రసాద్ కొట్టాడని , ఆ టైం లో మోహన్ బాబు కలుగజేసుకొని నా స్టాఫ్ ను కొట్టొద్దు..నేను వాడికి భయం పెడతా, నువ్వు చెయ్యి వేస్తే ఒప్పుకోను అని మనోజ్ ను నెట్టేశారు. ఎవ్వరికి దెబ్బలు తగలేదు, అన్న దమ్ముల మధ్య మనస్పర్థలు ఉన్నాయి, భూమా మౌనిక ను మనోజ్ పెళ్లి చేసుకోవడం ఎవ్వరికి ఇష్టం లేదు ..లక్ష్మి అక్క కూడా గతంలో పలు మార్లు ఇంట్లో గొడవలను సర్దుమణిగేలా చేసింది..ఇప్పుడు కూడా తండ్రి కొడుకుల మధ్య గొడవను సర్దుమణిగేలా చేస్తుంది ” అంటూ ఆ పనిమనిషి చెప్పుకొచ్చింది. మరి ప్రసాద్ ఎవరు..? అతడు ఏ తప్పు చేసాడు..? మనోజ్ కొట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది..? ఇవన్నీ ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి.
Read Also : Pushpa 2 : నార్తో దుమ్మురేపుతున్న ‘పుష్ప-2’