Harish Shankar : వాళ్లకు లేని బాధ మీకెందుకు.. డైరెక్టర్ ఎటాక్..!
ఆయన ఏజ్ ఏంటి ఈ యంగ్ హీరోయిన్ తో జత కట్టడం ఏంటని ట్రోల్ చేశారు. ఆన్ స్క్రీన్ మాత్రమే హీరో హీరోయిన్ కలిసి చేస్తారు. అయినా నటించే వాళ్లకు లేని బాధ మీకెందుకు అంటూ
- By Ramesh Published Date - 09:21 PM, Wed - 7 August 24

Harish Shankar స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాలు ఎంత పవర్ ఫుల్ గా తీస్తాడో అతని ఆఫ్ స్క్రీన్ మాటలు కూడా అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి. తనని టార్గెట్ చేసిన ప్రతి ఒక్కరికి అదిరిపోయే ఆన్సర్ ఇస్తూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు హరీష్ శంకర్. ప్రస్తుతం ఆయన తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఐతే ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో కొందరు స్టార్ హీరోల మీద చేస్తున్న ట్రోల్స్ పై ఘాటుగానే స్పందించాడు హరీష్ శంకర్. రవితేజ (Raviteja) ధమాకా సినిమా టైం లో ఆయన ఏజ్ ఏంటి ఈ యంగ్ హీరోయిన్ తో జత కట్టడం ఏంటని ట్రోల్ చేశారు. ఆన్ స్క్రీన్ మాత్రమే హీరో హీరోయిన్ కలిసి చేస్తారు. అయినా నటించే వాళ్లకు లేని బాధ మీకెందుకు అంటూ హరీష్ శంకర్ ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చేశారు.
Also Read : Bigg Boss Season 8 : బిగ్ బాస్ 8 హోస్ట్ విషయంలో మైండ్ బ్లాక్ ట్విస్ట్.. మార్పు మంచిదేనా..?
స్టోరీకి తగినట్టుగా పాత్రల ఎంపిక ఉంటుంది. ఆ విషయంలో వారికి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది అలా కాకుండా ఆ హీరో ఈ హీరోయిన్ తో ఎందుకు చేశాడంటూ కామెంట్స్ చేయడం నాన్సెన్స్ అనేలా చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. మీ ఇంట్లో అమ్మాయి పెళ్లి చేస్తున్నామంటే అది వేరే విషయం కానీ అసలు మీకు సంబంధం లేని విషయంలో ఎందుకు అంత ఇన్వాల్వ్ అవుతారని అన్నారు హరీష్ శంకర్.
ధమాకా టైం లో వచ్చిన ఈ ట్రోల్స్ సినిమా మీద ఎఫెక్ట్ పడతాయని అనుకుంటే ఆ సినిమా కాస్త 100 కోట్లు కలెక్ట్ చేసి మాస్ రాజాకి ఒక సూపర్ హిట్ ఇచ్చింది. ఐతే హరీష్ శంకర్ మాత్రం ఆ సినిమాపై వచ్చిన ట్రోల్స్ గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో ట్రోలర్స్ ని చెడామడా వాయించేశాడు.