Pawan Kalyan : పవన్ వ్యాఖ్యలపై హరీష్ శంకర్ క్లారిటీ
పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో కూడా చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి. ఆయనకి మామూలుగానే సామాజిక బాధ్యత ఎక్కువ. ఇప్పుడు ఆయన అటవీశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ సామాజిక బాధ్యతతో ఒక రిఫరెన్స్ తీసుకొని అలా అని ఉంటారు
- By Sudheer Published Date - 06:29 PM, Tue - 13 August 24

సినీ నటుడు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఏనుగుల సమస్యపై చర్చించేందుకు కర్ణాటక వెళ్లిన పవన్ కళ్యాణ్..అనంతరం అక్కడ మీడియా తో మాట్లాడుతూ.. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని కానీ ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలా పరిస్థితి మారిపోయిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ (Allu Arjun) ను ఉద్దేశించే చేసారంటూ బన్నీ ఫ్యాన్స్ పవన్ పై విరుచుకపడ్డారు. ఇండస్ట్రీ లోను దీనిపై చర్చ జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ప్రస్తుతం హరీష్ (Harish Shankar)..రవితేజ తో మిస్టర్ బచ్చన్ (Mister Bachchan) మూవీ తెరకెక్కించారు. ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ లో హరీష్ మాట్లాడుతూ.. మిస్టర్ బచ్చన్ లో హీరో చాలా నిజాయితీ పాత్ర అని చెప్పడంతో ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని మీడియా ప్రస్తావించింది. దీంతో హరీష్ శంకర్ స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో కూడా చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి. ఆయనకి మామూలుగానే సామాజిక బాధ్యత ఎక్కువ. ఇప్పుడు ఆయన అటవీశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ సామాజిక బాధ్యతతో ఒక రిఫరెన్స్ తీసుకొని అలా అని ఉంటారు. అయినా సినిమాల్లో చూపించినవి జనాలు చెయ్యరు. పుష్ప సినిమా చూసి ఎవరూ గొడ్డళ్లు పట్టుకొని అడవులకు వెళ్ళలేదు అని అన్నారు. దీంతో హరీష్ శంకర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Read Also : Janhvi Kapoor Tirumala : ప్రియుడి తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్