Harish Rao : ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ.. KCR సినిమా ఈవెంట్లో హరీష్ రావు..
మాజీ మంత్రి హరీష్ రావు KCR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు.
- By News Desk Published Date - 07:02 AM, Tue - 19 November 24

Harish Rao : జబర్దస్త్ రాకింగ్ రాకేష్(Rocking Rakesh) హీరోగా, తనే నిర్మాతగా తెరకెక్కిన సినిమా KCR. గరుడవేగ అంజి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పలు వాయిదాల అనంతరం KCR సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా గెస్ట్ లుగా వచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు KCR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు.
ఈ ఈవెంట్లో హరీష్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు కేసీఆర్. రాకేష్ కేసీఆర్ గారి పేరు మీద సినిమా తీయడం సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. కేసీఆర్ తెలంగాణను సాధించడమే కాదు అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించారు. రజనీకాంత్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు నేను హైదరాబాద్ లో ఉన్నానా లేదా న్యూయార్క్ లో ఉన్నానా అని. కేసీఆర్ గారు పల్లెలను అభివృద్ధి చేశారు, హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశారు. హైదరాబాద్ ని మనం చూసే భౌతికమైన అభివృద్దే కాదు సామాజిక పరంగా, సంస్కృతి పరంగా తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక దశ దిశను చూపించారు కేసీఆర్. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కేసీఆర్ గారు చేసిన కృషి. అధికారంలో ఉన్న పార్టీ వారి మీద సినిమాలు తీస్తారు కానీ అధికారంలో లేకపోయినా రాకేష్ ప్రేమతో కావచ్చు, దమ్ము ధైర్యంతో కావొచ్చు ఈ సినిమా తీశారు అని అన్నారు. దీంతో హరీష్ రావు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి కేసీఆర్ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.