HHVM : హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..ఈసారైనా థియేటర్స్ లోకి వచ్చేనా.?
HHVM : ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్‌తో పాటు టీమ్ ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ని కూడా షేర్ చేసింది. "ఒకరి పోరాటం అధికారం కోసం... మరొకరి పోరాటం ధర్మం కోసం... యుద్ధం మొదలైంది!" ఈ మాటలే సినిమా మూడ్‌ను అద్దం పట్టిస్తున్నాయి
- By Sudheer Published Date - 08:14 AM, Sat - 21 June 25

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు (Harihara Veeramallu) కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా జూలై 24న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు.
Bonalu: హైదరాబాద్‌లో జూన్ 26న గోల్కొండ బోనాలు ప్రారంభం
ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్‌తో పాటు టీమ్ ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ని కూడా షేర్ చేసింది. “ఒకరి పోరాటం అధికారం కోసం… మరొకరి పోరాటం ధర్మం కోసం… యుద్ధం మొదలైంది!” ఈ మాటలే సినిమా మూడ్‌ను అద్దం పట్టిస్తున్నాయి. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ యోధుడిగా నటిస్తున్నారు. స్టోరి యాక్షన్, చారిత్రక నేపథ్యంతో కూడినదిగా ఉండనుంది.
Yogandhra 2025: విశాఖ సాగరతీరంలో మొదలైన యోగాంధ్ర-2025 వేడుకలు
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒక కీలక విలన్ రోల్‌లో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. భారీ విజువల్స్, గ్రాఫిక్స్ మరియు చారిత్రక నేపథ్యం ఈ సినిమాను ప్రత్యేకతతో నిలిపేలా చూస్తున్నాయి. జూలై 24న సినిమా ప్రేక్షకుల ముందుకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు సినిమా వాయిదా పడడంతో ఈసారైనా రిలీజ్ చేస్తారా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.