HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hari Hara Veera Mallu Premiere Show Ticket Price

HHVM : తెలంగాణలో ‘ వీరమల్లు’ ప్రీమియర్ షో టికెట్ ధరలు ఎంతో తెలుసా?

HHVM : తెలంగాణలో 23వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలకు టికెట్ ధర రూ.600 (జీఎస్టీ అదనం) గా నిర్ణయించబడింది. అంతేకాకుండా జూలై 24 నుంచి 27 వరకు రోజుకు ఐదు షోలు వేసుకునే అవకాశం ఇచ్చింది

  • Author : Sudheer Date : 22-07-2025 - 11:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hhvm July 24th
Hhvm July 24th

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న భారీ హిస్టారికల్ అడ్వెంచర్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) విడుదలను ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ఈ నెల 24న సినిమా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 23వ తేదీన రాత్రి నుంచే ప్రీమియర్ షోల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు టికెట్ ధరలను కూడా పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

తెలంగాణలో 23వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలకు టికెట్ ధర రూ.600 (జీఎస్టీ అదనం) గా నిర్ణయించబడింది. అంతేకాకుండా జూలై 24 నుంచి 27 వరకు రోజుకు ఐదు షోలు వేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ నాలుగు రోజుల పాటు మల్టీ ప్లెక్స్‌లలో టికెట్ ధరను రూ.200 (జీఎస్టీ అదనం), సింగిల్ స్క్రీన్లలో రూ.150 (జీఎస్టీ అదనం)గా పెంచుకునేందుకు అనుమతించింది. అలాగే జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు కూడా ఐదు షోలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, టికెట్ ధరలను మల్టీ ప్లెక్స్‌లలో రూ.150, సింగిల్ స్క్రీన్లలో రూ.106 వరకు పెంచుకునేందుకు వీలు కల్పించింది.

Salman Bhutt : ప్రపంచ కప్, ఒలింపిక్స్‌లో కూడా పాక్‌తో ఆడ‌మ‌ని హామీ ఇవ్వాలి

అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రీమియర్ షోలు మరియు టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి పది రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ టికెట్‌పై రూ.100, అప్పర్ క్లాస్‌పై రూ.150, మల్టీ ప్లెక్స్‌లలో రూ.200 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోలకు కూడా 23వ తేదీ రాత్రి నుంచే అనుమతిస్తూ, టికెట్ ధర రూ.600గా నిర్ణయించబడింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ సినిమా విడుదల నేపథ్యంలో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఇప్పటికే పోస్టులు పెడుతున్నారు. ట్రైలర్, పాటలు, లుక్స్ ఇలా అన్ని సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్, నోరా ఫతేహి, జిషు సేన్ గుప్తా, సత్యరాజ్, రఘుబాబు, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో, ఎ.దయాకరరావు నిర్మించిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ భారీ హిస్టారికల్ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

House Arrest : YCP మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hari hara veera mallu premiere show tickets
  • hari hara veera mallu premiere show tickets AP
  • hari hara veera mallu premiere show tickets Price
  • hari hara veera mallu premiere show tickets Price Telangana
  • Hari Hara Veera Mallu Premiere SHows
  • HHVM
  • Pawan Kalyan

Related News

Chandrababu Pawan Kalyan

తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

బుధువారం జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కుట్రలు చేస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు

  • Pawan Kalyan Narrowly Escap

    పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

  • Pawan Kalyan

    పవన్ కళ్యాణ్ ను రోజు తిడితే ఎమ్మెల్సీ పదవి !!

  • Pawan Kalyan Campaign In Mu

    తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్

  • Bolli Shetty Satyanarayana

    జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన కీలక నేత..అయోమయంలో పార్టీ శ్రేణులు !!

Latest News

  • అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

  • ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

  • సీఎం రేవంత్ బినామీ కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు – కేటీఆర్ సంచలన ఆరోపణలు

  • ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ

Trending News

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd