Hanuman : ఇక హనుమాన్ వే థియేటర్లన్నీ..
- By Sudheer Published Date - 02:26 PM, Fri - 19 January 24
నిన్నటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు మారింది హనుమాన్ (Hanuman) మూవీ థియేటర్ల పరిస్థితి. సంక్రాంతి కానుకగా తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, నాగార్జున నటించిన నా సామిరంగా , వెంకటేష్ నటించిన సైంధవ్ , తేజ సజ్జ నటించిన హునుమాన్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిల్లో హనుమాన్ మూవీ కి ఏమాత్రం థియేటర్స్ దొరకలేదు. హైదరాబాద్ లో ఐతే కేవలం నాల్గు థియేటర్స్ మాత్రం హనుమాన్ కు లభించాయంటే అర్ధం చేసుకోవాలి చిన్న చిత్రాల మీద ఎంత ఉందొ..అనేది.
We’re now on WhatsApp. Click to Join.
కానీ కంటెంట్ ఉంటె చిన్న చిత్రం కూడా పెద్ద విజయం సాదిస్తుందని మరోసారి హనుమాన్ మూవీ నిరూపించింది. కథ ఫై నమ్మకం తో నిర్మాతలు సంక్రాంతి బరిలో తీసుకొచ్చి పెద్ద విజయం సాధించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ మూవీ అని..ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అని చెప్పడం తో ప్రేక్షకులు హనుమాన్ ను చూసేందుకు పరుగులుపెట్టారు. చాల చోట్ల టికెట్స్ దొరకపోవడం నిరాశకు గురై..మరోరోజు వరకు వెయిట్ చేసి సినిమా చూస్తున్నారు. ఇక ఈరోజు తో సంక్రాంతి సినిమాల మొదటి వారం పూర్తయిపోయింది. థియేటర్లకు సంబంధించిన చిక్కులు తొలిగిపోవడం తో చాల థియేటర్స్ హనుమాన్ మూవీ ప్రదర్శించేందుకు సిద్ధం అయ్యారు. గుంటూరు కారం , సైంధవ్ థియేటర్స్ చాల వరకు హనుమాన్ కు వెళుతున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, ఆంధ్రలో నా సామిరంగక షోలు పెంచుతున్నారు. బిసి సెంటర్లలో మంచి డిమాండ్ ఉండటంతో క్రమంగా అక్కడ పెరుగుదల కనిపిస్తోంది. ఇక మిగతా చాల చోట్ల హనుమాన్ కు ఛాన్స్ ఇస్తుండడం..ప్రేక్షకులు హనుమాన్ ను చూసేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇక హనుమాన్ మూవీ విషయానికి వస్తే.. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన రియల్ సూపర్ హీరో మూవీనే ‘హనుమాన్’. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీ ఇప్పటీకే వరల్డ్ వైడ్ గా వారం రోజుల్లో రూ. 100 కోట్లు క్రాస్ చేసి..150 వైపు పరుగులు పెడుతుంది. ఈ వారం లో ఈజీ గా రూ. 200 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
Read Also : Judges Invited : ఆ ఐదుగురు జడ్జీలకు రామమందిర ఆహ్వానం.. ఎవరు ?
Related News
Mirai Manchu Manoj : మిరాయ్ నుంచి మంచు హీరో లుక్.. ప్రీ లుక్ పోస్టర్ షేక్ అయ్యేలా ఉంటే..!
Mirai Manchu Manoj హనుమాన్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న తేజా సజ్జా లీడ్ రోల్ లో ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న సినిమా మిరాయ్.