Hansika Divorce : హన్సిక విడాకులు తీసుకోబోతుందా..? క్లారిటీ ఇచ్చిన భర్త
Hansika Divorce : గతంలో సోహైల్‌కు ఇది రెండో పెళ్లి. తన చిన్ననాటి స్నేహితురాలు రింకీ బజాజ్‌ను మొదట వివాహం చేసుకున్న ఆయన.. కొన్ని నెలలకే ఆమెతో విడాకులు తీసుకున్నారు
- By Sudheer Published Date - 01:11 PM, Sun - 20 July 25

టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన హన్సిక (Hansika) వివాహ జీవితం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2022లో వ్యాపారవేత్త సోహైల్ కతురియాను వివాహం చేసుకున్న హన్సిక.. అప్పటి నుంచి భర్తతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా కనిపించారు. వారి హనీమూన్ ట్రిప్స్, పెళ్లి వార్షికోత్సవ వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఇటీవల ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో హన్సిక ఇటీవల సింగిల్‌గా ఉన్న ఫోటోలు మాత్రమే షేర్ చేస్తుండటంతో, భర్తతో మనస్పర్థల కారణంగా వేరుగా ఉంటున్నారనే ఊహాగానాలకు బలమవుతోంది. హన్సిక తన తల్లితో, సోహైల్ తన కుటుంబంతో వేరుగా ఉంటున్నారన్న ప్రచారం పుట్టుకొచ్చింది. గతంలో ఎంత అన్యోన్యంగా ఉన్నా.. తాజాగా వారి మధ్య దూరం ఏర్పడిందా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. దీంతో వారి విడాకుల గురించి రూమర్లు ఊపందుకున్నాయి.
Washington : వాషింగ్టన్ రాష్ట్రంలో భయానక కాల్పులు.. ముగ్గురు మృతి
ఈ నేపథ్యంలో సోహైల్ స్వయంగా స్పందించారు. తన భార్య హన్సికతో విడాకుల విషయమంతా వట్టి గాసిప్స్ అని, వీటిలో నిజమెంతమాత్రం లేదని తేల్చి చెప్పారు. కానీ వేరుగా ఉంటున్నారనే ప్రచారంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అలాగే హన్సిక మాత్రం ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో ఆమె నుంచే మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.
గతంలో సోహైల్‌కు ఇది రెండో పెళ్లి. తన చిన్ననాటి స్నేహితురాలు రింకీ బజాజ్‌ను మొదట వివాహం చేసుకున్న ఆయన.. కొన్ని నెలలకే ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఆ పెళ్లికి హన్సిక కూడా హాజరయ్యారు. ఆ తర్వాతనే హన్సికతో వివాహం జరిగింది. ఈ వివాహ విశేషాలను ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో ఓటీటీలో డాక్యుమెంటరీగా కూడా విడుదల చేశారు. అప్పట్లో తన భర్త గతం గురించి తెలుసని, విడాకుల వ్యవహారంపై తనకు స్పష్టత ఉందని హన్సిక చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు మరోసారి అదే అంశం తెరపైకి రావడం ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.