Guntur Kaaram : గుంటూరు కారం లోని ‘మసాలా’ సాంగ్ లీక్..?
'గుంటూరు కారం' నుంచి విడుదల అయ్యే ఫస్ట్ సాంగ్ ఇది కాదని సమాచారం. తొలుత ఈ పాటను విడుదల చేయాలని ప్లాన్ చేసినా... ఎందుకో విరమించుకున్నారట
- By Sudheer Published Date - 10:59 AM, Sat - 4 November 23

చిత్రసీమ (Film Industry)లో లీక్ (Leak) ల పర్వం అనేది కొత్తేమి కాదు..ఎప్పటి నుండి నడుస్తున్నదే. సినిమాలోని కీలక సన్నివేశాలు , సాంగ్స్ , ఫైటింగ్ సీన్లు ఇలా సినిమాలో హైలైట్స్ వి లీక్ అవుతూనే ఉంటాయి. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అవి ఎక్కడినుండో ఓ చోట నుండి సోషల్ మీడియా లోకి లీక్ అయ్యి..వైరల్ అవుతుంటాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం (Guntur Kaaram) లోని ఓ సాంగ్ లీక్ అయినట్లు తెలుస్తుంది.
గతంలో త్రివిక్రమ్ – మహేష్ కలయికలో అతడు , ఖలేజా మూవీస్ వచ్చి అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో లో మూవీ రాబోతుండడం తో అంచనాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం సజావుగా సాగడం లేదు. నిత్యం ఏదొక కారణంతో బ్రేక్ పడుతూ వస్తుంది. ఇదిలా ఉంటె ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ కోసం మహేష్ అభిమానులు ఎప్పటి నుంచో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ బర్త్ డే (Trivikram Birthday)… నవంబర్ 7 నాడు ఈ సాంగ్ ప్రోమో లేదా సాంగ్ విడుదల తేదీ ప్రకటిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే… ఇంతలో సోషల్ మీడియాలో ఓ సాంగ్ చక్కర్లు కొట్టడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. ప్రముఖ మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుధ్ ‘గుంటూరు కారం’లో ఓ సాంగ్ పాడారు. అదే ‘మసాలా బిర్యానీ’ (Masala Biryani Song). ఆ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అయితే… ‘గుంటూరు కారం’ నుంచి విడుదల అయ్యే ఫస్ట్ సాంగ్ ఇది కాదని సమాచారం. తొలుత ఈ పాటను విడుదల చేయాలని ప్లాన్ చేసినా… ఎందుకో విరమించుకున్నారట.. ఇప్పుడు మెలోడీ సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేస్తారని టాక్. లీకైన ‘మసాలా బిర్యానీ’ తర్వాత వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి అధికారికంగా విడుదల చేయాల్సిన సాంగ్ ఇలా లీక్ అవ్వడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
Read Also : Telangana Election : పోస్టల్ బ్యాలెట్ ఓటు వెయ్యాలి అనుకునేవారు ఈరోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు