Guntur Kaaram : గుంటూరు కారం నుండి అసలైన ప్రోమో వచ్చేసింది
ఆదివారం దమ్ బిర్యానీ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు. ఈ ఫుల్ సాంగ్ త్రివిక్రమ్ బర్త్ డే నవంబర్ 7 నాడు రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది
- Author : Sudheer
Date : 05-11-2023 - 1:32 IST
Published By : Hashtagu Telugu Desk
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులు ఎప్పటి నుండి ఎదురుచూస్తున్న అసలైన ప్రోమో వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు (నవంబర్ 07) కు మరో రెండు రోజుల ముందే అభిమానుల్లో సంబరాలు నింపారు. గుంటూరు కారం (Guntur Kaaram) నుండి ‘దమ్ మసాలా’ సాంగ్ ప్రోమో (Dum Masala Song Promo) వచ్చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీలీల జంటగా త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం. గతంలో త్రివిక్రమ్ – మహేష్ కలయికలో అతడు , ఖలేజా మూవీస్ వచ్చి అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో లో మూవీ రాబోతుండడం తో అంచనాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం సజావుగా సాగడం లేదు. నిత్యం ఏదొక కారణంతో బ్రేక్ పడుతూ వస్తుంది. ఇదిలా ఉంటె ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ కోసం మహేష్ అభిమానులు ఎప్పటి నుంచో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం దమ్ బిర్యానీ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు. ఈ ఫుల్ సాంగ్ త్రివిక్రమ్ బర్త్ డే (Trivikram Birthday)… నవంబర్ 7 నాడు రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో జగపతి బాబు, రేఖ, రమ్యకృష్ణ, జైరాం, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Read Also : Virat Kohli Birthday: భర్తకు అనుష్క క్రేజీగా పుట్టినరోజు విశేష్