Get together Party : బండ్ల గణేశ్ ఇంట్లో గెట్ టు గెదర్ పార్టీ..ఎవరెవరు వచ్చారో తెలుసా..?
Get together Party : సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు, దర్శకులు హాజరై సందడి చేశారు.
- By Sudheer Published Date - 01:12 PM, Mon - 25 August 25

టాలీవుడ్‌లో Get together Party లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట్లో గెట్ టు గెదర్ పార్టీ జరిగింది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు, దర్శకులు హాజరై సందడి చేశారు. ప్రత్యేకంగా ఈ ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
UP : డాక్టర్ జేబులో నుండి ఐఫోన్ దొంగిలించి పట్టుబడ్డ దొంగ
ఈ గెట్ టు గెదర్ పార్టీకి శ్రీకాంత్, బ్రహ్మాజీ, ఆలీ, శివాజీ రాజా, కృష్ణవంశీ, రాజా రవీంద్ర, శివాజీ, కె. రాఘవేంద్రరావు, బీవీఎస్ రవి తదితరులు హాజరై వేడుకను మరింత ప్రత్యేకం చేశారు. ఈ సందర్భంగా నటుడు బ్రహ్మాజీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా బండ్ల గణేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. “30 ఇయర్స్ ఇండస్ట్రీ. పార్టీకి థాంక్యూ బండ్ల గణేశ్ బ్రో. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్‌తో… సీనియర్ యాక్టర్స్” అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. ఈ మాటలు చదివిన అభిమానులు కూడా ఉత్సాహంగా స్పందిస్తున్నారు.
ఇకపోతే ఇటీవలి కాలంలో ఇలాంటి రీ యూనియన్లు తరచుగా జరుగుతున్నాయి. గోవాలో ఇటీవల సీనియర్ హీరోయిన్లు, ప్రముఖ దర్శకులు, హీరోలు కలిసి ఘనంగా రీ యూనియన్ జరుపుకున్న విషయం తెలిసిందే. సంగీత, సిమ్రాన్, మహేశ్వరి, సంఘవి లాంటి నటి లతో పాటు శంకర్, కేఎస్ రవికుమార్, లింగుసామి వంటి దర్శకులు కూడా పాల్గొన్నారు. అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా ఎంజాయ్ చేశారు. ఈ నేపధ్యంలో బండ్ల గణేశ్ ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ కూడా టాలీవుడ్‌లో మరో గుర్తుండిపోయే వేడుకగా నిలిచింది.
30 years industry 😀❤️.. Thank you @ganeshbandla bro for hosting 🤗…
young n dynamic directors with senior citizens .. typo error… senior actors 😜 pic.twitter.com/TrS4NCScee— Brahmaji (@actorbrahmaji) August 24, 2025