UP : డాక్టర్ జేబులో నుండి ఐఫోన్ దొంగిలించి పట్టుబడ్డ దొంగ
UP : జూనియర్ డాక్టర్ కోటు జేబులో నుంచి ఐఫోన్‌ను దొంగిలించి చాకచక్యంగా పారిపోతుండగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాడు
- By Sudheer Published Date - 01:01 PM, Mon - 25 August 25

రోగుల వేషంలో ఆసుపత్రుల్లో దొంగతనాలకు పాల్పడే ఒక దొంగ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పోలీసులకు చిక్కాడు. హాస్పిటల్‌లో చికిత్స కోసం వచ్చినట్లుగా నటిస్తూ, ఒక జూనియర్ డాక్టర్ కోటు జేబులో నుంచి ఐఫోన్‌ను దొంగిలించి చాకచక్యంగా పారిపోతుండగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాడు. ఈ సంఘటన ఆగస్టు 20న కాన్పూర్‌లోని హాలెట్ హాస్పిటల్‌లో జరిగింది. అయితే, పోలీసుల వేగవంతమైన చర్యల కారణంగా దొంగను 60 నిమిషాల్లోనే పట్టుకున్నారు.
AP : ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ ఫైజ్ అనే వ్యక్తి కాన్పూర్‌లోని హాలెట్ హాస్పిటల్‌లోకి కాళ్లకు దెబ్బ తగిలినట్టుగా నటిస్తూ వచ్చాడు. వైద్య సిబ్బంది నమ్మకాన్ని చూరగొన్న అతను, క్షణాల వ్యవధిలో ఒక జూనియర్ డాక్టర్ కోటు జేబులో ఉన్న ఐఫోన్‌ను దొంగిలించాడు. సీసీటీవీ ఫుటేజీలో సాధారణ చొక్కా, నిక్కర్ ధరించి, వాకింగ్ స్టిక్‌తో నడుస్తూ, డాక్టర్ల మధ్య నుంచి వెళ్తూ తన కుడి చేతిని పక్కకు చాచి డాక్టర్ కోటులో నుంచి ఫోన్‌ను తీసుకుని, దానిని ఎవరూ చూడకుండా తన చంకలో పెట్టుకుని బయటకు వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వెంటనే విచారణ మొదలుపెట్టారు. దొంగను గుర్తించి కేవలం 60 నిమిషాల్లోనే అరెస్ట్ చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. “మొబైల్ దొంగ కంటే తెలివిగా పనిచేసిన మా బృందానికి అభినందనలు” అని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ వల్లే ఈ కేసును పరిష్కరించగలిగామని ఆయన తెలిపారు. విచారణలో, నిందితుడు మహ్మద్ ఫైజ్ ఇలాంటి నేరాలకు పాల్పడటానికి తన గుర్తింపును మార్చుకుంటున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ సంఘటన హాస్పిటల్స్ లో భద్రతా చర్యల ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది.