Geethanjali Malli Vachindi Talk : ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ టాక్..
శివ తుర్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య
- Author : Sudheer
Date : 11-04-2024 - 9:23 IST
Published By : Hashtagu Telugu Desk
కామెడీ హర్రర్ చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మ రథం పడుతుంటారు. ఇప్పటివరకు ఆలా వచ్చిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అలాంటి చిత్రాల్లో గీతాంజలి (Geethanjali) మూవీ ఒకటి. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ 2014 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi Talk) అనే మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
శివ తుర్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య, అలీ, రవిశంకర్, శైలజా ప్రియ తదితరులు నటించారు. ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమాలో కామెడీ తో పాటు భయపెట్టే సన్నివేశాలు ఉన్నాయని , ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయిందని , మరోసారి అంజలి భయపెట్టింది అంటున్నారు. మరికొంతమంది డీసెంట్ కామెడీ హారర్ అని, ఫస్ట్ హాఫ్‌లో కొన్ని లాగ్స్ సీన్స్ తప్పా.. చాలా వరకు ఎంటర్టైన్ చేశారని చెబుతున్నారు. కమెడియన్ కాస్టింగ్ అదిరిపోయిందట. సునీల్‌కు గ్రేట్ కమ్ బ్యాక్ అని అంటున్నారు. హారర్ టచ్‌తో మంచి ఎంటర్టైన్ ఇచ్చారని ట్వీట్లు వేస్తున్నారు. ఓవరాల్ గా సినిమా కు పాజిటివ్ టాక్ నడుస్తుంది.
Read Also ; MI vs RCB: ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తర పోరు.. ముంబై వర్సెస్ బెంగళూరు..!