Gauri Khan On Shah Rukh Khan: షారుఖ్ అలవాట్లు ఎంతగానో బాధించాయి.. గౌరీఖాన్ షాకింగ్ కామెంట్స్!
షారుఖ్ మాజీ భార్య గౌరీఖాన్ టాలీవుడ్ సూపర్ స్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
- By Balu J Published Date - 01:29 PM, Mon - 19 September 22
షారుఖ్ మాజీ భార్య గౌరీఖాన్ టాలీవుడ్ సూపర్ స్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తన భర్త షారూఖ్ ఖాన్ ఇంట్లో పార్టీ చేసుకుంటున్నప్పుడు, ఇంటికి వచ్చే అతిథులను అదే పనిగా చూస్తుంటారని గౌరీ ఖాన్ షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 7 రాబోయే ఎపిసోడ్లో గౌరీ, ఆమె స్నేహితులు మహీప్ కపూర్, భావన పాండేతో కలిసి సందడి చేసింది. కరణ్ జోహార్ తాజా ఎపిసోడ్లో.. షారుఖ్ ఖాన్ కు సంబంధించిన విషయాలను వెల్లడించింది. షారుఖ్ అలవాటు కొన్నిసార్లు తనను చాలా బాధపెట్టిందని గౌరీ రియాక్ట్ అయ్యింది.
“’షారుఖ్ నా మాట వినడు. షూటింగ్స్ లో బిజీగా ఉంటూ ఫ్యామిలీని పట్టించుకోడు. అంతేకాక షారుఖ్‌కి పొసెసివ్‌నెస్ ఎక్కువ. మొదట్లో దాన్ని నేను భరించలేకపోయాను. ఇంటికి వచ్చే గెస్టులను ఎప్పుడూ చూస్తుంటాడు. అతను పార్టీల సమయంలో లోపల కంటే, బయట ఎక్కువ సమయం గడిపినట్లు కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. పార్టీలు ఇంట్లో కాకుండా రోడ్డు మీద పార్టీ చేసుకుంటున్నట్లు నాకు అనిపించేది! ”అని గౌరీ ఖాన్ అన్నారు. ఇవేకాకుండా మరికొన్ని విషయాలను గౌరీ వెల్లడించింది. త్వరలో ఈ షో హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ భార్యగా గౌరీఖాన్ అందరికి సుపరిచితమే. 1991లోనే వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌కు హాజరైన గౌరీ షారుఖ్ గురించి అనేక విషయాలని తెలియచేసింది. దాంతో పాటు గతంలో షారుఖ్ తో విడిపోయి మళ్ళీ కలిసినట్టు కూడా తెలిపింది.
Related News
Ram : అక్కడ మార్కెట్ చూసుకుని భారీగా పెంచేసిన రామ్.. మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ది వారియర్, స్కంద సినిమాతో నిరాశపరచిన రామ్ డబుల్ ఇస్మార్ట్ తో