Gangavva : బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ అవుట్..!
Gangavva ఈ సీజన్ లో ఓటింగ్ తక్కువ రాకపోయినా సరే హెల్త్ ఇష్యూస్ వల్ల గంగవ్వ శనివారం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.
- By Ramesh Published Date - 09:59 AM, Sun - 10 November 24

బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 8 లో శనివారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. మామూలుగా అయితే ప్రతి వీకెండ్ ఆ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరికి లీస్ట్ ఓటింగ్ వస్తుందో వారిని ఎలిమినేట్ చేస్తారు. కానీ ఈ సీజన్ లో ఓటింగ్ తక్కువ రాకపోయినా సరే హెల్త్ ఇష్యూస్ వల్ల గంగవ్వ శనివారం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. కాళ్లు చేతులు తిమ్మిరులు వస్తున్నాయని.. వారం రోజుల నుంచి ఒకపూట భోజనమే అవుతుందని హోస్ట్ నాగార్జునకు చెప్పింది.
నాగార్జున (Nagarjuna) హౌస్ లో ఉంటావా బయటకు వచ్చేస్తావా అంటే వెళ్తానని చెప్పింది. దాంతో గంగవ్వ బయటకు వచ్చేందుకు ఓకే చెప్పారు. నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరు నేడు ఆదివారం ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన గంగవ్వ Bigg Boss 8 ఐదు వారాలు హౌస్ లో ఉంది.
హౌస్ లో ఐదు వారాలు..
బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా హౌస్ లోకి వచ్చిన గంగవ్వ (Gangavva) అప్పుడు కూడా ఐదు వారాలు మాత్రమే హౌస్ లో ఉండి బయటకు వచ్చేసింది. ఈ సీజన్ లో కూడా గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నామినేషన్స్ లోకి రాలేదు. ఐతే బిగ్ బాస్ హౌస్ లో ఇక తను కొనసాగడం కష్టమని భావించిన గంగవ్వ నాగార్జునని రిక్వెస్ట్ చేయగా ఆయన బయటకు వచ్చేయండని చెప్పాడు.
హౌస్ మెట్స్ అందరికీ గుడ్ బై చెప్పి గంగవ్వ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. హౌస్ నుంచి ఆమె వెళ్తున్నందుకు రోహిణి, తేజతో పాటు మిగతా హౌస్ మెట్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
Also Read : Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ తోనే రికార్డ్ మోత మోగిస్తుందా.. 12వేల స్క్రీన్స్ అంటే రచ్చ రచ్చ..!