Game Changer Teaser ..మెగా ఫాన్స్ ఆకలి తీర్చేసింది
Game Changer : బేసిగ్గా రామ్ అంత మంచోడు ఇంకొకడు లేడు. కానీ వాడి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు’ అనే వాయిస్ తో శంకర్ ఆసక్తి రేపారు. ఈ మూవీ లో రామ్ చరణ్ క్యారెక్టర్ డిఫరెంట్ గెటప్స్ తో కనిపిస్తుందని టీజర్ చూస్తే స్పష్టం అవుతుంది
- By Sudheer Published Date - 08:12 PM, Sat - 9 November 24

ఎప్పుడెప్పుడా అని మెగా ఫ్యాన్స్ (MegaFans) అంత ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer Teaser) ఫస్ట్ లుక్ టీజర్ రావడమే కాదు..మెగా అభిమానుల ఆకలి తీర్చేసింది. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా పై మెగా (Mega Fans ) అభిమానుల్లో, తెలుగు చిత్రసీమలోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. రామ్ చరణ్ (Ram Charan) పాత్రను ఆయన గత చిత్రాల కంటే పూర్తిగా కొత్తగా, విభిన్నంగా తీర్చిదిద్దినట్లు సమాచారం. ఇందులో చరణ్ లీడ్ రోల్ లో ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. మూడేళ్ళుగా ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక జనవరి 10 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతుండటం తో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాగా సినిమా ప్రమోషన్ల విషయంలో మేకర్స్ అభిమానులను నిరాశ పరుస్తుండడంతో ఇక ఈరోజు అసలైన టీజర్ రిలీజ్ చేసి వారి ఆగ్రహాన్ని చల్లార్చారు.
ఇక టీజర్ (Game Changer Teaser) విషయానికి వస్తే..
‘బేసిగ్గా రామ్ అంత మంచోడు ఇంకొకడు లేడు. కానీ వాడి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు’ అనే వాయిస్ తో శంకర్ ఆసక్తి రేపారు. ఈ మూవీ లో రామ్ చరణ్ క్యారెక్టర్ డిఫరెంట్ గెటప్స్ తో కనిపిస్తుందని టీజర్ చూస్తే స్పష్టం అవుతుంది. స్టూడెంట్ గా, సివిల్ సర్వెంట్ గా, స్టూడెంట్ లీడర్ గా, పొలిటికల్ లీడర్ గా భిన్నమైన క్యారెక్టరైజేషన్ గెటప్స్ లలో చరణ్ కనిపించాడు.
ఇక శంకర్ టేకింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మరోసారి తన టేకింగ్ తో మెస్మరైజింగ్ గా చేసాడు. కన్నుల విందు అనిపించేలా భారీ స్థాయిలో కొన్ని సీన్స్ చేశారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. చాలా అద్భుతమైన లొకేషన్స్ లో సాంగ్స్ షూట్ చేశారు. టీజర్ లోకథ జోలికి వెళ్లకుండా క్యారెక్టర్లను రివీల్ చేసారు. కైరా అద్వానీ, ఎస్ జె సూర్య, సముద్రఖని.. ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ .. వాడు ఏం చేశాడు.. ఏం చేశాడు.. ఏం చేశాడు.. అనే డైలాగ్ తో ఒక క్యురియాసిటీని క్రియేట్ చేశాయి. చివరిలో రామ్ చరణ్ ‘ఐయాం అన్ ప్రెడిక్టబుల్’ అని చెప్పడం టీజర్కు హైప్ తెచ్చింది. తమన్ బ్యాగ్రౌండ్ స్కోరు యాక్షన్ సీక్వెన్స్ ని మరింతగా ఎలివేట్ చేసింది. దిల్ రాజు ఎక్కడ రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థమవుతుంది.
Read Also : Drinking Hot Water: 21 రోజులు ఖాళీ కడుపుతో వేడి నీళ్లను తాగితే ఏమవుతుందో తెలుసా?