Indian 2 – Game Changer : ఇండియన్ 2లో గేమ్ ఛేంజర్.. కిక్ ఇస్తున్న శంకర్ నయా ప్లాన్..
ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ విషయంలో శంకర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. తాజాగా ఇండియన్ 2లో గేమ్ ఛేంజర్ ప్రెజెన్స్ ఉండేలా..
- By News Desk Published Date - 04:51 PM, Mon - 6 May 24

Indian 2 – Game Changer : శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఇండియన్ 2, గేమ్ ఛేంజర్. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 మూవీ.. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’కి సీక్వెల్ గా వస్తుంది. ఇక చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ పొలిటికల్ డ్రామాతో వింటేజ్ శంకర్ స్టైల్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగా.. గేమ్ ఛేంజర్ చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటుంది.
కాగా ఈ రెండు సినిమా ప్రమోషన్స్ విషయంలో శంకర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. కమల్ క్రేజ్ ని గేమ్ ఛేంజర్ కోసం, చరణ్ క్రేజ్ ని ఇండియన్ 2 కోసం ఉపయోగించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇండియన్ 2 ఆడియో లాంచ్ కి రామ్ చరణ్ ని గెస్ట్ గా తీసుకు వస్తున్నారు. ఇది కాకుండా ఇండియన్ 2లో గేమ్ ఛేంజర్ ప్రెజెన్స్ ఉండేలా కూడా చూసుకుంటున్నారట. ఇండియన్ 2కి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారట. కమల్ సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పాలని శంకర్ అడగడంతో.. చరణ్ వెంటనే ఓకే చెప్పేశారట.
త్వరలోనే రామ్ చరణ్ ఈ వాయిస్ ఓవర్ డబ్బింగ్ చెప్పనున్నారట. కాగా ఇండియన్ 2ని జూన్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. కానీ ఇప్పుడు ఈ సినిమా జూన్ నుంచి జులైకి వెళ్లినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా బ్యాలన్స్ ఉండడం వలనే మూవీని జులైకి వాయిదా వేస్తున్నారట. అయితే దీని పై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా మే 16న ఈ మూవీ ఆడియో లాంచ్.. రామ్ చరణ్, రజినీకాంత్ అతిథులుగా చెన్నైలో గ్రాండ్ గా జరగనుంది.
Also read : Vijay Deverakonda : ఇది కదా క్రేజ్ అంటే.. వైజాగ్‌లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హంగామా..