Gadar 2: బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరుగరాస్తున్న గదర్ 2, 12 రోజుల్లో 400 కోట్లు!
సెకండ్ వీకెండ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టి బాలీవుడ్ సినిమాల్లో గదర్ 2 ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది.
- By Balu J Published Date - 03:57 PM, Wed - 23 August 23
పఠాన్ విజయంతో బాలీవుడ్ మళ్లీ సక్సెస్ బాట పట్టింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్లు సాధించిన చిత్రంగా షారుక్ పఠాన్ మూవీ నిలిచిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్‌స్టార్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్, లవ్ సిన్హా, మనీష్ వాద్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు రాబడుతున్నది. విడుదల అయిన నాటి నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నది. సెకండ్ వీకెండ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టి బాలీవుడ్ సినిమాల్లో గదర్ 2 ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది.
సెకండ్ వీక్ లో కూడా రెండంకెల వసూళ్లను సాధించి, సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గదర్ నిన్న 12.10 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. దీంతో ఈ సినిమా మొత్తం 400.70 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. యాక్షన్ డ్రామా అమీర్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్, హిందీ బెల్ట్‌లో దంగల్ కలెక్షన్లను క్రాస్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు ఈ మూవీ KGF 2 (435 కోట్ల నికర) కలెక్షన్లను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మున్ముందు విడుదలయ్యే సినిమాలకు నెగిటివ్ టాక్ వస్తే గదర్ 2 మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.
2001 సంవత్సరంలో రిలీజైన గదర్ ఏక్ ప్రేమ్ కథ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన గదర్ 2 చిత్రాన్ని సుమారు 80 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత సూపర్ హిట్ టాక్ రావడంతో స్క్రీన్ కౌంట్ భారీగా పెంచారు. పలు దేశాల్లో రెండోవారంలో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ సక్సెస్ కావడంతో.. నేటితరం బాలీవుడ్ హీరోలు కండలు పెంచి, డాన్సులు చేస్తే సరిపోదని, మంచి కథబలమున్నా సినిమాలు చేయాలని సన్నీ డియోల్ సలహా ఇచ్చాడు.
Also Read: Vijay Deverakonda: ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు: రౌడీ బాయ్ షాకింగ్స్ కామెంట్స్
Related News
Gopichand Malineni : మైత్రి మేకర్స్.. గోపీచంద్ మలినేని.. ఆ బాలీవుడ్ హీరో ఫిక్స్..!
Gopichand Malineni పాన్ ఇండియా లెవెల్ లో సంచలన విజయాలు అందుకుంటున్న తెలుగు మేకర్స్ తో పనిచేసేందుకు బాలీవుడ్ స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ ని బీట్ చేసేలా టాలీవుడ్ సినిమాల