Minu Munir : ఆ డైరెక్టర్ అశ్లీల వీడియోలు చూడమన్నాడు.. ప్రముఖ నటి సంచలన ఆరోపణలు
అయితే అలాంటి వీడియోలను చూడనని తాను చెప్పానన్నారు. ఈమేరకు ఫేస్‌బుక్ వేదికగా మిను మునీర్(Minu Munir) ఒక సంచలన పోస్ట్ చేశారు.
- By Pasha Published Date - 07:20 PM, Sun - 29 September 24

Minu Munir : మలయాళం మూవీ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ బాలచంద్ర మీనన్‌పై నటి మిను మునీర్ సంచలన ఆరోపణలు చేశారు. పోర్న్ వీడియోలను చూడమని తనను ఆయన బలవంతపెట్టారని ఆమె వెల్లడించారు. అయితే అలాంటి వీడియోలను చూడనని తాను చెప్పానన్నారు. ఈమేరకు ఫేస్‌బుక్ వేదికగా మిను మునీర్(Minu Munir) ఒక సంచలన పోస్ట్ చేశారు.
Also Read :Whatsapp Tips : ఈ 4 నంబర్లను మీ వాట్సాప్ లో తప్పకుండా సేవ్ చేసుకోండి.. ఎందుకో తెలుసా?
‘‘అది డైరెక్టర్ బాలచంద్ర మీనన్ గది. ఆయన ముగ్గురు యువతులతో కలిసి కూర్చొని పోర్న్ వీడియోలను చూస్తున్నారు. ఆ సమయానికి నేను గదిలోకి వెళ్లాను. నన్ను చూసిన ఆయన.. పోర్న్ వీడియోలను కలిసి చూసేందుకు రమ్మని అడిగారు. అయితే నేను అందుకు అంగీకరించలేదు. అలాంటివి చూడనన్నాను. వెంటనే ఆ గది నుంచి బయటికి వచ్చాను’’ అని 2007 సంవత్సరంలో తనకు ఎదురైన వేధింపుల గురించి మిను మునీర్ గుర్తు చేసుకున్నారు.
Also Read :Amit Shah : అగ్నివీరులకు పెన్షన్‌తో కూడిన ఉద్యోగం ఇస్తాం
2013 సంవత్సరంలోనూ తనకు ఇలాంటివే వేధింపులు ఎదురయ్యాయని నటి మిను మునీర్ చెప్పుకొచ్చారు. ఒక మూవీ ప్రాజెక్టు కోసం పనిచేస్తుండగా తనకు శారీరక, మానసిక వేధింపులు ఎదురయ్యాయని చెప్పారు. ఆ వేధింపులు ఎంతకూ ఆగకపోవడంతో తాను విసిగివేసారి, మలయాళం మూవీ ఇండస్ట్రీని వదిలేశానని మిను మునీర్ తెలిపారు. అనంతరం తాను చెన్నైకి షిఫ్ట్ అయిపోయిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇటీవలే ప్రముఖ నటుడు జయసూర్య సహా ఏడుగురిపై మిను మునీర్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. దానిపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు సంచలన ఆరోపణలతో ఆమె మరో బాంబు పేల్చారు. మొత్తం మీద మలయాళం మూవీ ఇండస్ట్రీకి చెందిన నటీమణులు ఒక్కరొక్కరుగా తమకు ఎదురైన లైంగిక వేధింపుల వివరాలను బయటపెడుతున్నారు.