Ganja Case : గంజాయితో పట్టుబడ్డ సినీ డైరెక్టర్లు
Ganja Case : సినీ ప్రముఖులపై ఇలాంటి ఆరోపణలు రావడంతో మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
- By Sudheer Published Date - 10:46 AM, Sun - 27 April 25

మలయాళ సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళం డైరెక్టర్లు ఖలీద్ రెహమాన్ మరియు అష్రఫ్ హమ్లా (Khalid Rahman, Ashraf Hamza) గంజాయితో పట్టుబడ్డారు. కొచ్చి ఎక్సైజ్ అధికారులు తెలిపిన ప్రకారం.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ ఫ్లాట్‌లో వీరిద్దరూ తమ స్నేహితుడితో కలిసి గంజాయి (Ganja) సేవించేందుకు సిద్ధమవుతుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 1.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ED Office Fire: ఈడీ ఆఫీసు భవనంలో భారీ అగ్నిప్రమాదం
పట్టుబడ్డ డైరెక్టర్లను ఎక్సైజ్ అధికారులు విచారించి, అనంతరం బెయిల్ పై విడుదల చేశారు. గంజాయి వినియోగానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సినీ ప్రముఖులపై ఇలాంటి ఆరోపణలు రావడంతో మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
ఖలీద్ రెహమాన్ దర్శకత్వంలో రూపొందిన ‘జింఖానా’ సినిమా ఏప్రిల్ 25న తెలుగులో విడుదల కావడం గమనార్హం. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల నడుమ ఈ కేసులో చిక్కుకోవడం ఆయన కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటువంటి ఘటనలు సినీ ప్రముఖులపై ఉన్న ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.