Jani Master : జానీ మాస్టర్ బాగోతాలు తెలిస్తే ‘ఛీ’ కొట్టకుండా ఉండలేరు ..!!
Choreographer Jani Master : ఔట్ డోర్ షూటింగ్ పేరుతో చెన్నై, ముంబై ,హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో… జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని బాధితురాలు తెలిపింది.
- By Sudheer Published Date - 09:55 PM, Mon - 16 September 24

Choreographer Jani Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) పై లైంగిక వేధింపుల కేసు (Harassment Case) ఇప్పుడు సంచలనం రేపుతోంది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్.. లైంగిక దాడి చేస్తున్నారంటూ 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు పిర్యాదు చేయడంతో అంత దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
నెల్లూరు (Nellore) నగరానికి చెందిన జానీ ఈటీవీ లో ప్రసారమైన ఢీ డాన్స్ షో (Dhee Dance Show) తో పాపులర్ అయ్యాడు. ఆ షో లో జానీ టాలెంట్ చూసిన అల్లు అర్జున్ తన సినిమాల్లో మొదటగా ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస పెట్టి అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ..అతి తక్కువ టైంలోనే టాప్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తెలుగు లోనే కాదు ఇతర భాషల్లోనూ అగ్ర హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తూ వస్తున్నాడు.
ప్యాంట్ జిప్ తీసి.. చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు
అలంటి జానీ మాస్టర్ గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ పిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. 2019 నుంచి తనపై జానీ వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది. ఢీ షో ద్వారా జానీ మాస్టర్ పరిచయం అయ్యారని.. ఆ తర్వాత తనను ఆయన టీంలో చేర్చుకున్నారని తెలిపింది. ఔట్ డోర్ షూటింగ్ పేరుతో చెన్నై, ముంబై ,హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో… జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని బాధితురాలు తెలిపింది. షూటింగ్ స్పాట్‌లోనూ వదిలేవాడు కాదని.. కార్వాన్‌లోకి లాక్కెళ్లి.. ప్యాంట్ జిప్ తీసి.. చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదులో పేర్కొంది.
జానీ మాస్టర్‌కు ఆయన భార్య కూడా సహకరించేది
తను చెప్పిన దానికి అంగీకరించకపోతే.. అద్దానికి తన తల బాదేవాడని.. తీవ్రంగా దాడి చేసేవాడని.. ఇండస్ట్రీ లో ఛాన్సులు లేకుండా చేస్తానని బెదిరించే వాడని ఫిర్యాదులో తెలిపింది. జానీ మాస్టర్ ఎన్ని దారుణాలు చేసినా.. ఆయనకు ఎప్పుడూ తను లొంగిపోలేదని రాసుకొచ్చింది. మతం మార్చుకొని.. తనను పెళ్లి చేసుకోవాలని జాన్ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడని.. జానీ మాస్టర్‌కు ఆయన భార్య కూడా సహకరించేదని.. వాపోయింది. ఇంటికి వచ్చి మరీ ఆమె తనపై దాడి చేసిందని తెలిపింది. ఈమె పిర్యాదు తో జానీ మాస్టర్ పై పోలీసుల ఐపీసీ చట్టం కింద సెక్షన్ 376, నేరపూరితంగా బెదిరింపులు, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, కింద కేసు నమోదు చేశారు.
కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుండి జానీ సస్పెండ్
ఇక ఈ పిర్యాదు నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఇటు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సైతం దీనిని సీరియస్ గా తీసుకుంది. ఓ వ్యక్తి చేసిన పొరపాటు వలన అసోసియేషన్‌కు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో జానీ మాస్టర్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం కొరియోగ్రాఫర్స్ అత్యవసర సమావేశం జరగనుంది. సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో ఈరోజు (సోమవారం) జరగాల్సిన అసోసియేషన్ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. జానీ మాస్టర్‌ను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంపై రేపు నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటె సోమవారం ఉదయం నుంచి జానీ ఫోన్లు స్విచ్చాఫ్ చేసి ఉండడం తో అతడి అచూకి కోసం పోలీసులు వెతుకుతున్నారు. అలాగే జానీ చివరిగా ఎవరితో మాట్లాడాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అరెస్ట్ చేస్తారనే భయంతోనే జానీ మాస్టర్ పరారయ్యాడని తెలుస్తోంది.
Read Also : Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో ఎల్లుండే తొలి దశ ఎన్నికలు..భారీగా భద్రత ఏర్పాటు..!