Fan : అభిమాన హీరోకు రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన అభిమాని..ఏంట్రా ఇది !!
Fan : ప్రస్తుతం సంజయ్ దత్ తన బిజీ షెడ్యూల్‌తో సినిమాల్లో బిజీ బిజీ గా నటిస్తునాన్రు. తెలుగులో నందమూరి బాలకృష్ణతో కలిసి 'అఖండ 2'లో కీలక పాత్ర పోషిస్తున్నారు
- By Sudheer Published Date - 08:14 PM, Mon - 28 July 25

సినీ పరిశ్రమలో ఎంతో మంది నటులు తెరపై కనిపించే పాత్రలకే పరిమితం కాకుండా, నిజ జీవితంలోనూ తమ వ్యక్తిత్వం, మానవత్వంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) ఒకరు. ‘ఖల్ నాయక్’గా సినిమాల్లో భయపెట్టిన ఈ స్టార్, నిజ జీవితంలో మాత్రం మనసున్న మానవుడిగా చక్కటి ఉదాహరణగా నిలిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన 2018 సంఘటన గురించి చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తన అభిమాని నిషా పాటిల్ ఇచ్చిన రూ.72 కోట్ల ఆస్తిని ఏ మాత్రం ఆలోచించకుండా ఆమె కుటుంబానికి తిరిగి ఇచ్చిన సంఘటనకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Arshdeep Singh: ఇంగ్లాండ్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. వీడియో వైరల్!
2018లో ముంబై మలబార్ హిల్స్‌లో నివసిస్తున్న 62 ఏళ్ల వృద్ధురాలు నిషా పాటిల్, సంజయ్ దత్‌కు వీరాభిమాని. ఆమె తన చివరి రోజుల్లో తన ఆస్తిని సంజయ్ దత్ పేరుతో వీలునామా రాయించారు. ఇది తెలిసిన తర్వాత, సంజయ్ దత్ ఆ ఆస్తిని స్వీకరించకుండా, ఆమె కుటుంబసభ్యులకే తిరిగి అప్పగించారని ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ఇది ఆయన నిజాయితీని, కరుణను, అభిమానుల పట్ల గల గౌరవాన్ని నిగ్గు తేల్చే విషయం. నేటి లోకం లో ఇలా నిజాయితీ తో ప్రవర్తించగల వ్యక్తులు కొద్దిమందే ఉంటారు.
సంజయ్ దత్ సినీ ప్రస్థానం కూడా ఎన్నో మలుపులతో కూడింది. 1981లో ‘రాకీ’తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, ‘నామ్’, ‘ఖల్ నాయక్’, ‘వాస్తవ్’, ‘మున్నాభాయి MBBS’ వంటి చిత్రాల్లో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. అయితే 1993లో బాంబు పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించారు. కానీ ఆ సమయంలో కూడా అభిమానులు ఆయనకు అండగా నిలవడంతో తిరిగి తన కెరీర్‌ను నిలబెట్టుకున్నారు. ఈ జీవిత ప్రయాణం ఆయనలోని పట్టుదల, మారుమూలలలోనూ నిలిచిపోయే ప్రభావాన్ని చెబుతుంది.
Auto Tips : మీరు మీ వాహనాన్ని ఫుల్ ట్యాంక్ పెట్రోల్‌తో నింపుతారా.? దీన్ని గుర్తుంచుకోండి..!
ప్రస్తుతం సంజయ్ దత్ తన బిజీ షెడ్యూల్‌తో సినిమాల్లో బిజీ బిజీ గా నటిస్తునాన్రు. తెలుగులో నందమూరి బాలకృష్ణతో కలిసి ‘అఖండ 2’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్‌లో ‘ధురంధర్’ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో పాటు ప్రభాస్‌తో కలిసి ‘ది రాజా సాబ్’లోనూ నటిస్తున్నారు. రెండు చిత్రాలు డిసెంబర్ 5, 2025న విడుదల కానున్నాయి. అలాగే కన్నడంలో ‘కె.డి. – ది డెవిల్’లోనూ కనిపించనున్నారు.