Bigg Boss 6: రాజ్ తో ఒక ఆట ఆడుకున్న ఫైమ.. రా పక్కన కూర్చో అంటూ?
సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్ లో కూడా లవ్ ట్రాకులు, ఫన్నీ ట్రాకులు బాగానే వర్కవుట్ అవుతుంటాయి.
- By Nakshatra Published Date - 02:53 PM, Sat - 1 October 22
సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్ లో కూడా లవ్ ట్రాకులు, ఫన్నీ ట్రాకులు బాగానే వర్కవుట్ అవుతుంటాయి. ఇక అలా లవ్ ట్రాకులు ఉన్నాయి అని తెలిస్తే బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా వారిని మరింత హైలెట్ చేస్తూ ఉంటారు. అలాగే అటువంటి జంటలపై ఫన్నీ గా కూడా కామెంట్ చేస్తూ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ ఉంటారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 6 లో రెండు జంటలు,ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక లవ్ ట్రాక్ కూడా సెట్ అవ్వలేదు.
అర్జున్ శ్రీ సత్య తో పులిహోర కలపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అది అంతగా వర్కౌట్ అవడం లేదు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో ఫైమా, రాజ్ ల మధ్య ఫన్నీ సంభాషణ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తోంది. ఫైమా,రాజ్ లను అందరూ ఒక ఆట ఆడించారు. రాజ్ నా నడుము గిల్లాడు అంటూ ఫైమా కౌంటర్లు వేస్తుంది. అప్పుడు ఫైమా ఇలా నడుము గిల్లితే అందరూ చూస్తే ఏమనుకుంటారు నాకు ఎలా పెళ్లి అవుతుంది అంటూ రాజ్ నీ ఫుల్ గా ఆట పట్టిస్తుంది పైమా.
అప్పుడు వెంటనే సత్య అలా ఎలా పట్టేసుకుంటావు అంటూ మరింత వెక్కిరించింది. అప్పుడు చంటి కూడా పైమా మీద కౌంటర్లు వేశాడు. ఇంత అందగత్తె అంటూ సెటై ర్లు వేశాడు. అప్పుడు రాజ్, ఫైమాను పిలిచి ఇటురా అంటూ సైగ చేసి అక్కడ కూర్చో అన్నట్టుగా పిలిచాడు. దాంతో అందరూ కలిసి మళ్ళీ రాజ్ నీ టార్గెట్ చేశారు. అప్పుడు సత్య పైమాని మరింత రెచ్చగొడుతూ ఇలాంటివి చేస్తే ఆమెకు పెళ్లి ఎలా అవుతుంది అని అంటుంది. తనకి ఫైమా రాజ్ మధ్య కామెడీ సీన్ బాగానే వర్కౌట్ అయింది.
Related News
Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య సీన్స్ డిలీట్ చేసారా?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది. ఇకపోతే తాజాగా విడుదల అయిన టిల్లు స్క్వేర్ మూవీలో అను�