EXCLUSIVE: నయనతార తల్లి కాబోతోందా..? అసలు నిజమిదే!
కొలీవుడ్ ప్రేమ పక్షులు నయనతార, విఘ్నేష్ శివన్‌ల ప్రేమ గురించి అందరికీ తెలిసిందే.
- By Balu J Published Date - 02:55 PM, Wed - 23 March 22

కోలివుడ్ ప్రేమ పక్షులు నయనతార, విఘ్నేష్ శివన్‌ల ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఈ జంట ఏమాత్రం సమయం దొరికినా ఏకాంతంగా గడిపేందుకు ఇష్టపడుతుంటారు. అంతేకాదు.. నచ్చిన స్పాట్స్ కు వెళ్తూ.. తమదైన స్టైయిల్ లో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఎప్పట్నుంచే ప్రేమలో మునిగిన ఈ జంట పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారా? విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు విషయం ఏమిటంటే..
ఈ జంట రహస్యంగా వివాహం చేసుకుందని, అద్దె గర్భం ద్వారా బిడ్డను కనాలని యోచిస్తున్నారని అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. ఎందుకంటే నయనతార పలు సినిమాలను సైన్ చేసింది. ఇందులో షారుఖ్ ఖాన్-అట్లీతో పాటు లేజర్ కూడా ఉంది. ఇతర ప్రాజెక్టులు కూడా నయనతార కంప్లీట్ చేయాల్సి ఉంది. సో తర్వలో ఆమె పెళ్లి ఉండదు. అయితే ఈ జంట తమకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని వెల్లడించారు. “ఇది నా ఎంగేజ్‌మెంట్ రింగ్. మేం గ్రాండ్‌గా వేడుకలు చేసుకోవాలనుకోలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.. ఆ విషయం ఖచ్చితంగా అందరికీ తెలియజేస్తాం. మా నిశ్చితార్థం సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అయితే మా పెళ్లి ఇంకా నిర్ణయించుకోలేదు” అని గతంలో సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. నయన తార షారుక్ ఖాన్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలోనూ నటిస్తోంది.