Mahesh Babu: సితారకు డాన్స్ అంటే ఇష్టం.. అందుకే ‘పెన్నీ’ స్టెప్పులు వేసింది!
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల కుమార్తె సితార చాలా యాక్టివ్. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. అయితే మొదటిసారి ‘సర్కారు వారి పాట’లో తన డాన్స్ తో ఆకట్టుకుంది.
- Author : Hashtag U
Date : 12-04-2022 - 5:48 IST
Published By : Hashtagu Telugu Desk
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల కుమార్తె సితార చాలా యాక్టివ్. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. అయితే మొదటిసారి ‘సర్కారు వారి పాట’లో తన డాన్స్ తో ఆకట్టుకుంది. పెన్నీ సాంగ్ లో తన స్టెప్పులతో మెస్మరైజ్ చేసింది. అయితే సితార పెన్నీ పాటలో ఎందుకు నటించాల్సి వచ్చిందో తల్లి నమ్రత తెలిపింది. ” సర్కారు వారి పాటలో కళావతి పాట అందర్నీ ఆకట్టుకుంది. ఆ పాటకు ప్రతిఒక్కరూ ఫిదా అయ్యారు. సితారకు నచ్చి తనదైన స్టెప్పులు వేసింది. ఆ వీడియో థమన్ కు బాగా నచ్చి మహేష్ వద్ద ప్రస్తావించాడు. ఆ విషయం మాకు మహేష్ చెప్పాడు‘‘ అని చెప్పింది. సర్కారు వారి పాట సెకండ్ సింగిల్ లో నటింపజేయాలని థమన్ అడగడంతో మహేశ్ కూడా ఒకే అన్నారు. కానీ సెట్స్ లో ఎలా ఉంటుందో అని భయపడ్డాం. సినిమా అంటేనే క్రమశిక్షణతో కూడుకున్నది. వర్కింగ్ టైంలో ఎంతో సహనం, ఓపిక కూడా అవసరం. కానీ సితార ఎలాంటి బెరుకు లేకుండా నటించింది. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సితార వయస్సు 5 సంవత్సరాలు. ప్రస్తుతం క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది’’ అని తల్లి నమ్రత వెల్లడించింది.
#Penny… a very special one for me!! Couldn't be prouder, my rockstar! #SitaraGhattamaneni 🤗🤗🤗https://t.co/mKevCLQ6Ls@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @MythriOfficial @saregamasouth
— Mahesh Babu (@urstrulyMahesh) March 20, 2022