Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Enjoy Telugu Indian Idol Mega Event On June 17

Indian Idol: ‘ఇండియన్ ఐడల్ మెగా ఈవెంట్’ ను ఎంజాయ్ చేద్దామా!

అత్యుత్త‌మ‌మైన తెలుగు గాత్రాన్ని క‌నుగొనే ఉద్దేశంతో ప్ర‌పంచంలోనే బిగ్గెస్ట్ స్జేజ్ ప్రోగ్రామ్ తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌ను

  • By Balu J Updated On - 12:02 PM, Sat - 11 June 22
Indian Idol: ‘ఇండియన్ ఐడల్ మెగా ఈవెంట్’ ను ఎంజాయ్ చేద్దామా!

అత్యుత్త‌మ‌మైన తెలుగు గాత్రాన్ని క‌నుగొనే ఉద్దేశంతో ప్ర‌పంచంలోనే బిగ్గెస్ట్ స్జేజ్ ప్రోగ్రామ్ తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సంగీత ప్రియుల మధ్య గణనీయమైన ఆదరణ పొందిన తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో ముగింపుకు వచ్చింది. స్వర మాధుర్యంతో అలరించిన ఐదుగురు ఫైనలిస్టులతో ఓ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి షోను ఓ టీంగా చేసినందుకు నాకు ఆనందంగా ఉంది. టీంగా మేం గెలిచాం. గత ఆరు నెలలుగా ఈ టీంతో ప్రయాణిస్తూ వచ్చాను. నాకు చాలా సిగ్గు. కానీ నేను ఎలా మారిపోయానో నాకే తెలియడం లేదు. ఆ స్పేస్ క్రియేట్ చేసిచ్చిన అరవింద్ గారికి థ్యాంక్స్. ఆయన నన్ను రెండు విషయాల్లో చాలా మార్చారు. నేను చాలా లో స్టేజ్‌లో ఉన్నప్పుడు సరైనోడు సినిమాను ఇచ్చారు. ఇది నీకు కరెక్ట్ సినిమా అని హోప్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇండియన్ ఐడిల్ చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం నాలోని ఇంకో కోణాన్ని చూస్తోంది. చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆ క్రెడిట్ అంతా కూడా అరవింద్ గారిదే. ఆహా కోసం నేను ముందు నుంచి పని చేస్తూనే ఉన్నాను. అల్లు అర్జున్ గారితో నాకు కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. రేసుగుర్రం, సరైనోడు, అల వైకుంఠపురములో వంటి సినిమాలున్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి థ్యాంక్స్. జీవితంలో నాకు ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. షోను అలా సరదాగా నడిపించిన శ్రీరామచంద్రకు థ్యాంక్స్. కార్తిక్ 8 వేల పాటలు పాడారని అంటారు. అవి బయటకు వచ్చినవి మాత్రమే. నలభై వేల స్క్రాచెస్ చేశారు. లక్షకు పైగా ప్రోగ్రాంలు ఇచ్చి ఉంటారు. గత 22 ఏళ్లుగా మేం స్నేహితులం. బాయ్స్ సినిమా అప్పటి నుంచి మాకు పరిచయం ఉంది. ఆయన తన కష్టంతోనే పైకి వచ్చారు. నిత్యా మీనన్ అద్భుతమైన పర్ఫార్మర్. షో మొత్తాన్ని జడ్జ్ చేయగలుగుతున్నా కానీ నిత్యాను జడ్జ్ చేయలేకపోతోన్నాను. 55 మంది సింగర్ల నుంచి 9.. 9 మంది నుంచి ఈ రోజు 5 మంది వరకు వచ్చారు. ఫ్రీమాంటల్ ఆహాలకు థ్యాంక్స్’అని అన్నారు.

నిత్యా మీనన్ మాట్లాడుతూ.. ‘నిత్యాను జడ్జ్ చేయలేకపోతోన్నాని అని తమన్ అనడం బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఇండియన్ ఐడల్ లాంటి షో నాకు కొత్త అనుభవం. నేను ఎన్నో భిన్నమైన కారెక్టర్లు చేశాను. ఈ ఆఫర్ నాకు వచ్చినప్పుడు ఇదొక పెద్ద అడ్వంచర్ అని అనుకున్నాను. అలానే జరిగింది. ఎంతో అందమైన అనుభూతి కలిగింది. మేం అందరం ఫ్రెండ్స్ అయిపోయాం. ఎంతో సరదాగా జరిగింది. మొదటి రోజు ఈ సింగర్లను చూస్తూ వస్తున్నాం. ఎంతో ఎదుగుతూ వచ్చారు. ఎప్పుడో ఏదైనా పాట విని వీళ్ల పేర్లు అందులో చూస్తే మన పిల్లలు అనే గర్వం ఉంటుంది. ఇండియన్ ఐడల్ అనేది నాకు ఒక అడ్వంచర్. ఫ్రీ మాంటల్, ఆహాలు మా అందరినీ ఎంతో బాగా చూసుకున్నారు’ అని అన్నారు.

సింగర్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘ఆదివారం ఎప్పుడు వస్తుందా? అని చూసేవాడిని. హైద్రాబాద్‌కు ఎప్పుడు వస్తానా? అని చూసేవాడిని. అంతలా నన్ను బాగా చూసుకున్నారు. ఆహా, ఫ్రీ మాంటల్ వారికి థ్యాంక్స్. నా కో జడ్జ్‌లైన తమన్, నిత్యా మీనన్‌లకు థ్యాంక్స్. వారిద్దరూ నాకు ఎంతో కాలం నుంచి తెలిసినా కూడా ఇలా ఈ స్టేజ్ మీద ఇంకో కోణాన్ని చూశాను. ఇలాంటి రియాల్టీ షోల్లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేశాను. ఒకప్పుడు నేను రన్నర్‌గా మిగిలాను. ఇక్కడున్న ఐదుగురు ఫైనలిస్ట్‌లు అద్భుతమైన గాయకులు. వారిలోని టాలెంట్‌ను బయటకు తీసుకొచ్చేందుకు మేం చేతనైన సాయం చేశామంతే’ అని అన్నారు.

సింగర్ హేమచంద్ర మాట్లాడుతూ.. ‘ఏ కళాకారుడికైనా వేదిక ముఖ్య. ఇలాంటి ఓ వేదికను ఏర్పాటు చేసిన అరవింద్ గారికి థ్యాంక్స్. 2010 హిందీ ఐడల్ నాకు సింగర్‌గా గుర్తింపు ఇస్తే.. ఇప్పుడు ఈ తెలుగు ఐడల్ నాకు హోస్ట్‌గా గుర్తింపు ఇచ్చింది. మంచి మంచి సింగర్లు వచ్చి తెలుగు ఇండియన్ ఐడల్‌ను హిట్ చేశారు. ఎంతో మంది ఈ షో గురించి మాట్లాడుతున్నారు. ఫ్రీ మాంటల్ టీం ఎంతో కష్టపడింది. ఈ షోను ఇంత పెద్ద హిట్ చేసిన అందరికీ థ్యాంక్స్. వేదిక ఎంత అవసరమో.. ఆ తరువాత అవకాశాలు కూడా ముఖ్యం. అరవింద్, తమన్ వంటి వారు ఈ షో వెనకాల ఉన్నారు. కచ్చితంగా అందరికీ అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘నేను ఈ రోజు థ్యాంక్స్ చెప్పేందుకు రాలేదు. అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు వచ్చాను. తమన్, కార్తిక్, నిత్యా మీనన్‌లందరికీ థ్యాంక్స్. బిగ్ బాస్ షోలో శ్రీరాం ఉన్నప్పుడు నా భార్య నాతో ఓట్లు వేయించింది. అప్పుడు శ్రీరామచంద్ర గురించి నాకు తెలిసింది. ఈ షోను అద్భుతంగా నడిపించారు. ఫ్రీ మాంటల్ ఇచ్చిన ఐడియా, సపోర్ట్‌కు థ్యాంక్స్. ఆహా తరుపున అందరికీ థ్యాంక్స్. నాకు అజిత్‌కు పడదు. 29 మిలియన్ డౌన్‌లోడ్లు అయ్యాయనేది అనేది సర్ ప్రైజ్ కాదు, సబ్ స్రైబర్లు రోజూ ఆహాను చూస్తారు అనేది సర్ ప్రైజ్ కాదు. జూన్ 10న రాబోయే అన్‌స్టాపబుల్ టాప్ 6 కూడా సర్ ప్రైజ్ కాదు. కానీ ఆ నెక్స్ట్ వారం రాబోయే గ్రాండ్ ఫినాలే మాత్రం సర్ ప్రైజ్‌గా ఉంటుంది. క్యాష్ ప్రైజ్‌తో పాటు.. విన్నర్, రన్నర్‌ల ఫ్యూచర్‌ల గురించి కూడా సర్ ప్రైజ్‌లుంటాయి. ఇన్ని సర్ ప్రైజ్‌లున్న ఎపిసోడ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావొద్దని రూ. 99కే మెంబర్‌షిప్ ఇచ్చి పరిమిత కాలానికి ఆహాను చూడొచ్చు. అదే పెద్ద సర్ ప్రైజ్. జూన్ 17న మెగా ఈవెంట్ జరగబోతోంది. అందరూ ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

ఆహా సీఈవో అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘అరవింద్ గార అందరికీ థ్యాంక్స్ చెప్పేశారు. మీడియా ఇలా వచ్చి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్. ఈ అద్భుతమైన సింగర్స్‌కు ఇప్పటికే కోట్ల సంఖ్యలో ఓట్లు వచ్చాయి. వంశీ, నానిలకు థ్యాంక్స్. అరవింద్, రామ్‌లకు స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పాలి. శ్రీరామచంద్ర 2010లో సోనీలో విన్నర్‌గా నిలిచాడు. ఇప్పుడు ఇక్కడ అద్భుతంగా షోను నడిపించాడు. కార్తీక్ అంతా తానై చూసుకున్నారు. నిత్యా మీనన్ తన మనసును పెట్టి షోను చేశారు. 17న ఏం జరుగుతుందనేది ముఖ్యం కాదు. ఆ ఐదుగురూ విజేతలే’ అని అన్నారు.

Tags  

  • allu aravind
  • event
  • first indian
  • telugu

Related News

Kiran Abbavaram: ప్రేక్షకులందరికీ ‘సమ్మతమే’

Kiran Abbavaram: ప్రేక్షకులందరికీ ‘సమ్మతమే’

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ "సమ్మతమే".

  • Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా వాగ్దేవి!

    Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా వాగ్దేవి!

  • Virat Kohli: విరాట్‌కోహ్లీ @ 200 మిలియన్లు

    Virat Kohli: విరాట్‌కోహ్లీ @ 200 మిలియన్లు

  • Allu Aravind Vs Pawan Kalyan : జ‌న‌సేనానిపై అరవింద్ ప‌రోక్ష వార్‌

    Allu Aravind Vs Pawan Kalyan : జ‌న‌సేనానిపై అరవింద్ ప‌రోక్ష వార్‌

  • Allu Aravind: ఈ సినిమాలో అంద‌రూ హీరోలే!

    Allu Aravind: ఈ సినిమాలో అంద‌రూ హీరోలే!

Latest News

  • NITI Aayog : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను ప్ర‌శంసించిన నీతి ఆయోగ్

  • Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ పనులు అస్సలు చెయ్యకండి.. అవి ఏంటంటే?

  • TTD : రేపు సెప్టెంబ‌ర్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌ చేయ‌నున్న‌ టీటీడీ

  • Gurukul Schools : అన్ని గురుకుల పాఠ‌శాలల్లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్య – సీఎం కేసీఆర్‌

  • Health Benefits: చికెన్, చేపలు తిన్న తర్వాత పొరపాటున కూడా ఇవి తాగకూడదు.. తాగితే అంతే!?

Trending

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

    • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

    • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: