Lucky Bhaskar : లక్కీ భాస్కర్ అప్పుడే OTTలోకి వచ్చేస్తుందా..?
Lucky Bhaskar దీవాళికి రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. మహానటి, సీతారామం తర్వాత హ్యాట్రిక్ సినిమాగా లక్కీ భాస్కర్ సక్సెస్ అందుకుంది. ఐతే ఈ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగా
- By Ramesh Published Date - 07:50 PM, Sun - 10 November 24

సార్ సినిమా తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా లక్కీ భాస్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) లీడ్ రోల్ లో నటించగా అతని సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను పీరియాడికల్ డ్రామాగా బ్యాంక్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించారు. సినిమా షూటింగ్ అంతా సైలెట్ గా చేసిన మేకర్స్ దీపావళికి సినిమా రిలీజ్ చేశారు.
దీవాళికి రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. మహానటి, సీతారామం తర్వాత హ్యాట్రిక్ సినిమాగా లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) సక్సెస్ అందుకుంది. ఐతే ఈ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాను నవంబర్ 30న ఓటీటీ రిలీజ్ (OTT Release) చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఎన్టీఆర్ దేవర..
నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కాబోతుంది. తెలుగులో రిలీజ్ అవుతున్న భారీ సినిమాలు అన్నీ నెట్ ఫ్లిక్స్ లోనే రిలీజ్ అవుతున్నాయి. ఈమధ్యనే ఎన్టీఆర్ దేవర సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. వాటితో పాటే లక్కీ భాస్కర్ సినిమా కూడా ఈ నెల 30న ఓటీటీ రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగు, తమిళ భాషల్లో కాంతా అనే సినిమా చేస్తునాడు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుండగా రానా కూడా సినిమాలో భాగం అవుతున్నాడు.
Also Read : Venkatesh : అరకులో వెంకటేష్ సినిమా సందడి.. సంక్రాంతికి వచ్చే ప్లాన్ లో భాగంగా..!