Kriti Sanon: ‘ఆది పురుష్’ పై కృతి సనన్ రియాక్షన్.. టీజర్ చూసి అంచనాకు రావొద్దు!
ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు మొదలయ్యాయో, అంతకంటే ఎక్కువ విమర్శలు
- By Balu J Published Date - 05:38 PM, Fri - 18 November 22

ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు మొదలయ్యాయో, అంతకంటే ఎక్కువ విమర్శలు సైతం వినిపించాయి. హనుమంతుడు పాత్రధారికి లెదర్ దుస్తులు వేయడం, రావణాసురుడికి వింత వాహనాన్ని కట్టబెట్టడం లాంటి విషయాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రామాయణ ఇతిహాసాన్ని తప్పుదోవ పట్టించేలా టీజర్ ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, సినిమా విడుదల తేదీని కూడా వాయిదా వేశారు. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమాను జూన్ కు వాయిదా వేశారు. ఇలా ఆదిపురుష్ పై ఓ రేంజ్ లో చర్చ సాగుతున్న వేళ.. ఆ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది హీరోయిన్ కృతి సనన్.
ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో కనిపించిన కృతి, టీజర్ చూసి సినిమాపై ఓ అంచనాకు రావొద్దని చెబుతోంది. ఆదిపురుష్ టీజర్ అనేది కేవలం ఓ శాంపిల్ మాత్రమే అంటోంది కృతి సనన్. ఈ సినిమా విషయంలో తనతో పాటు యూనిట్ మొత్తం చాలా గర్వంగా ఫీల్ అవుతోందని, కేవలం టీజర్ చూసి ఓ అంచనాకు రావొద్దని చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ది బెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆదిపురుష్ కోసం గ్రాఫిక్ వండర్ ను తీర్చిదిద్దుతున్నట్టు ప్రకటించింది కృతి సనన్.