PS2: పీఎస్2లో జూనియర్ ఐశ్వర్యగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టారా?
సినీ ఇండస్ట్రీకి చెందిన చైల్డ్ ఆర్టిస్టులు చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు.
- By Nakshatra Published Date - 04:21 PM, Sun - 30 April 23
PS2: సినీ ఇండస్ట్రీకి చెందిన చైల్డ్ ఆర్టిస్టులు చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. ఎంత తొందరగా పెరుగుతారో తెలీదు కానీ.. అందం మాత్రం బాగా పెంచేస్తారు. ఇప్పటికే చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు పెద్దవారిగా మారి హీరో, హీరోయిన్ పొజిషన్లో దూసుకెళ్తున్నారు. మరి కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడిప్పుడే మరోసారి రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఒకప్పుడు తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు మరోసారి ఎక్స్ప్రెషన్స్ తో పాటు అందంతో కూడా ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..
డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 రీసెంట్గా విడుదలై ప్రస్తుతం థియేటర్లో బాగా హడావుడి చేస్తుంది. ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్టు సొంతం చేసుకున్న ఈ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ప్రేక్షకులు తెగ మాట్లాడుకుంటున్నారు. ఐశ్వర్యరాయ్ చిన్ననాటి పాత్రలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది. ఆమె ఎవరో కాదు సారా అర్జున్. గతంలో విక్రమ్, అనుష్క జంటగా నటించిన నాన్న సినిమాలో విక్రమ్ కూతురుగా నటించిన పాపనే ఈ పాప.
అప్పుడు సారా అర్జున్ కేవలం ఐదేళ్లు వయసులో ఉంది. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా చేసింది. ఇక పీఎస్ 2 లో ఐశ్వర్యరాయ్ చిన్ననాటి పాత్రలో నటించి అద్భుతంగా మెప్పించింది. నిజానికి ఆ సినిమాలో అంతమంది అందగత్తెలు ఉన్నప్పటికీ కూడా సారా అర్జున్ మాత్రం వారి కంటే అందంగా కనిపించింది. ఇక ఈ సినిమాలో ఆమెను చూసిన ప్రేక్షకులంతా ఎప్పటికీ గుర్తిండి పోయే పాత్రలో చేసింది అని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా అద్భుతంగా నటించింది అని.. కచ్చితంగా ఈమె భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అవుతుంది అని అంటున్నారు.
Related News
Vikramarkudu: విక్రమార్కుడు సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో ఎలా ఉందో మీకు తెలుసా!
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలో విక్రమార్కుడు సినిమా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో