Naga Chaitanya : నాగచైతన్య ఫేవరెట్ డిష్ ఏంటో తెలుసా..?
నాగచైతన్య ఇష్టంగా తినే ఫేవరెట్ డిష్ ఏంటో తెలుసా..?
- Author : News Desk
Date : 29-01-2024 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya).. నాగేశ్వరరావు, నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, వారి లెగసీని ముందుకు తీసుకువెళ్తున్నారు. తన తాత, తండ్రి లాగానే నాగచైతన్య కూడా టాలీవుడ్ మన్మథుడు ట్యాగ్ ని సొంతం చేసుకున్నారు. లవ్ స్టోరీస్ తో వరుస హిట్స్ అందుకుంటూనే మధ్యమధ్యలో మాస్ సినిమాలతో కూడా ఆడియన్స్ ని పలకరిస్తున్నారు. కాగా నాగచైతన్య ఇష్టంగా తినే ఫేవరెట్ డిష్ ఏంటో తెలుసా..?
ఈ విషయాన్ని చైతన్యని అడిగితే, ఆయన చెప్పిన డిష్(Food) ఏంటంటే.. వైట్ రైస్‌లో ముద్దపప్పు, పచ్చిపులుసు, నెయ్యి వేసుకొని తినడం చాలా ఇష్టమని చెప్పారు. ఈ కాంబినేషన్ కి తోడుగా వడియాలు, మటన్ అండ్ రొయ్యలు ఫ్రై సైడ్ స్నాక్స్ గా తింటుంటే చాలా బాగుంటుందని చెప్పారు. లంచ్ టైంలో తనకి ఎక్కువగా తినాలి అనిపిస్తే.. ముందుగా ఈ కాంబినేషనే ఎక్కువగా తినడడానికి ఇష్టపడతానని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ కాంబినేషన్ వింటుంటే మీకు కూడా తినాలి అనిపిస్తుంది కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి.
ఇక నాగచైతన్య ప్రొఫెషనల్ కెరీర్ విషయానికి వస్తే.. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ తో కూడా చైతన్య ఆడియన్స్ ని అలరిస్తున్నారు. రీసెంట్ గా చైతన్య ‘దూత’ అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని పలకరించారు. త్వరలో తండేల్ అనే మాస్ సినిమాతో రాబోతున్నాడు.
Also Read : Sivaji : శివాజీ సినిమాలో అపరిచితుడు.. డిలీట్ సీన్ మీరు చూశారా..?